పట్టపగలు బెంగాల్ బీజేపీ కార్యకర్త దారుణ హత్య

BJP worker murdered వెస్ట్ బెంగాల్ లో పట్టపగలో ఓ బీజేపీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు. మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో నార్త్ 24 పరగణాస్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. చనిపోయిన బీజేపీ కార్యకర్తని అశోక్ సర్థార్ గా గుర్తించారు పోలీసులు. అశోక్ నార్త్ 24 పరగణాస్ జిల్లాలోని నారాయణ్ పూర్ నివాసి అని తెలిపారు.
కోల్ కతాకు 15 కిలోమీటర్ల దూరంలోని ఓ వర్క్ నిమిత్తం మాధ్యమ్ గ్రామ్స్ లోని రాజ్ బరి ఏరియాలో ఉన్న ఓ వర్క్ నిమిత్తం అశోక్ పై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారని,అశోక్ ఛాతీలో ఒక బుల్లెట్,కాళ్లపై పలుమార్లు కాల్చారు. దీంతో వెంటనే స్థానికులు అశోక్ ని హాస్పిటల్ కి తరలించారు. అయితే,అశోక్ మరణించినట్లు డాక్టర్లు ప్రకటించారు. అశోక్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం తరలించారు.
అయితే,ఈ కాల్పులు వెనుక తృణముల్ కాంగ్రస్ హస్తముందని బాధితుడి కుటుంబసభ్యులు ఆరోపించారు. బీజేపీకి మద్దతిస్తున్నామన్న కారణంతోనే తన తండ్రిపై కాల్పులు జరిపి చంపేశారని అశోక్ కుమారుడు లల్తూ ఆరోపించారు. ఓ పక్కా ప్రణాళిక ప్రకారమే తన తండ్రిని హత్య చేశారని అన్నారు. రాజకీయ కక్ష్యతోనే తన తండ్రిని చంపేశారని తెలిపారు. ఈ హత్యకు స్థానిక టీఎంసీ మద్దతిచ్చిందన్నారు. కాగా, బీజేపీ, బాధితుడి కుటుంబసభ్యులు చేసిన ఆరోపణలను టీఎంసీ ఖండించింది.
అటు బెంగాల్ బీజేపీ యూనిట్ కూడా టీఎంసీ గూండాలే ఈ హత్య చేయించారని ఆరోపించింది. బెంగాల్ లో రాష్ట్రపతి పాలన విధించాలని బీజేపీ సీనియర్ నేత కైలాష్ వార్గీయ డిమాండ్ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం,కేంద్రప్రభుత్వం జోక్యం చేసుకుని..బెంగాల్ లో త్వరలో జరుగనున్న ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్ గా జరిగేలా చూడాలని కోరారు. అయితే,బెంగాల్ గవర్నర్ కూడా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాల్సిన పరిస్థితులు తెలెత్తున్నాయంటూ పలు మార్లు మమత సర్కార్ పై ఫైర్ అయిన విషయం తెలిసిందే.