Gujarat : కాలికి గాయంతో ఫుట్ పాత్ మీద కీచైన్లు అమ్ముతున్న పసివాడు.. ఎమోషనల్ అయిన నెటిజన్లు
పుస్తకాలు పట్టుకోవాల్సిన చేతుల్తో కీ చైన్లు పట్టుకున్నాడు. పాఠాలు చదవాల్సిన వాడు కీ చైన్లు అమ్ముతున్నాడు. అహ్మదాబాద్‌లో ఫుట్‌పాత్ మీద ఓ చిన్నారి కీ చైన్లు అమ్ముతున్న వీడియో చూసేవారి మనసు కదలించింది.

Gujarat
Gujarat : బిజీగా ఉండే సిగ్నల్స్ దగ్గర పెన్నులు, బెలూన్స్, పిల్లలు ఆడుకునే వస్తువులు అమ్మే చిన్న పిల్లల్ని చూస్తుంటాం. ఎండల్లో.. వానల్లో ఆగిన వాహనాదారుల వద్దకు వెళ్లి రిక్వెస్ట్ చేస్తూ వారు వస్తువుల అమ్మే విధానం చూస్తే మనసు బాధ కలుగుతుంది. రీసెంట్‌గా గుజరాత్‌లోని ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కాలికి గాయంతో ఓ చిన్న పిల్లవాడు కీ చైన్స్ అమ్ముతున్న వీడియో వైరల్ అవుతోంది. వీడియో చూసిన అందరి మనసు చలించిపోయింది.
Boy playing with a python : కొండచిలువతో ఆడుకుంటున్న పసివాడు.. పేరెంట్స్‌ని తిట్టిపోస్తున్న జనం
ఇంటి ఆర్ధిక పరిస్థితులు బాగోలేక కొందరు చిన్నారులు బడికి వెళ్లాల్సిన వయసులో బతుకుతెరువు కోసం కష్టపడుతుంటే మనసు తరుక్కుపోతుంది. గుజరాత్ అహ్మదాబాద్‌లోని ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర చిన్న పిల్లవాడు కీచైన్లు అమ్ముతున్న వీడియో sj.artsylens అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేశారు. బాలుడి కుడిపాదానికి గాయం అయి ఉండొచ్చు క్లాత్ చుట్టి కనిపిస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఎమోషనల్ అయ్యారు.
‘ఏదో ఒకరోజు నువ్వు ఖచ్చితంగా విజయం సాధించాలని భగవంతుడిని కోరుకుంటున్నాను’ అని ఒకరు.. ‘అతను విధితో పోరాటం చేస్తున్నాడు’ అని మరొకరు వరుసగా కామెంట్లు చేశారు. స్కూలు బ్యాగ్ పట్టుకుని చదువుకోవాల్సిన బాల్యంలో చిన్నారి కీ చైన్లు అమ్ముతూ కష్టపడటం చాలామందికి కంటనీరు తెప్పించింది.
View this post on Instagram