మొదటి స్థానంలో బీఎస్పీ.. నాల్గవ స్థానంలో టీడీపీ

  • Published By: vamsi ,Published On : April 15, 2019 / 03:59 AM IST
మొదటి స్థానంలో బీఎస్పీ.. నాల్గవ స్థానంలో టీడీపీ

Updated On : April 15, 2019 / 3:59 AM IST

దేశంలోనే ఎక్కువ బ్యాంక్ బ్యాలెన్స్ కలిగిన రాజకీయ పార్టీగా బహుజన సమాజ్ వాది పార్టీ నిలిచింది. కేంద్ర ఎన్నికల కమీషన్‌కు పార్టీలు ఇచ్చిన వివరాల ప్రకారం ఈ విషయం వెల్లడైంది.  ఈ ఏడాది ఫిబ్రవరి 25వతేదీన కేంద్ర ఎన్నికల కమిషన్‌కు అధికారికంగా సమర్పించిన నివేదికలో పార్టీ బ్యాంక్ బ్యాలెన్స్ రూ.669 కోట్లు అని పార్టీ వెల్లడించింది. దేశ రాజధాని నగరమైన ఢిల్లీలోని పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లోని 8 ఖాతాల్లో రూ.669 కోట్ల డిపాజిట్లు ఉన్నట్లు పార్టీ చూపించింది. అయితే 2014ఎన్నికల సమయంలో మాత్రం ఆ పార్టీకి డిపాజిట్లు కూడా లేవు. అప్పుడు  బీఎస్పీకి రూ.95.54 లక్షల నగదు చేతిలో ఉన్నట్లు చూపించింది. ఐదేళ్ల కాలంలో ఈ డబ్బు ఘననీయంగా పెరగడం విశేషం.

ఇక రెండవ స్థానంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన సమాజ్‌వాదీపార్టీ బ్యాంకు ఖాతాల్లో రూ.471 కోట్లు ఉన్నాయి. మూడవ స్థానంలో కాంగ్రెస్ పార్టీ రూ.196కోట్లు, టీడీపీ రూ.107 కోట్లు, బీజేపీ రూ.82కోట్లు, సీపీఎం రూ.3కోట్లు, ఆప్ పార్టీ రూ.3కోట్ల బ్యాంకు బ్యాలెన్స్ కలిగి ఉన్నట్లు ఈసీకి సమర్పించిన నివేదికల్లో వెల్లడైంది. ఇక 2017-18లో బీజేపీ రూ.1,027 కోట్ల విరాళాలు సేకరించగా.. రూ.758 కోట్లను ఎన్నికలలో ఖర్చు  పెట్టినట్లు చూపించింది. అయితే బ్యాంక్ బ్యాలెన్స్ విషయంలో మాత్రం ఆ పార్టీ 5వ స్థానంలో ఉండడం గమనార్హం.