Parliament Session : పార్లమెంట్ సమావేశాలు.. షెడ్యూల్ ఇదే
సోమవారం ఉదయం 11 గంటలకు సెంట్రల్ హాల్ లో ఉభయసభల సభ్యులనుద్దేశించి రాష్ట్రపతి రామనాధ్ కోవింద్ ప్రసంగించనున్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకు లోక్ సభ లో ఆర్ధిక మంత్రి

Budjet 2021 22
Budget 2022 Session : పార్లమెంట్ సమావేశాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రెండు విడతలుగా బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయి. 2022, జనవరి 31వ తేదీ ఫిబ్రవరి 11 వరకు తొలి విడత బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకు మలివిడత బడ్జెట్ సమావేశాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఫిబ్రవరి 2 నుంచి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రాజ్యసభ సమావేశం కానుంది. ఫిబ్రవరి 2 బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సమావేశం లోక్ సభ సమావేశం కానుంది.
Read More : New Smart Phone: Flipkartలో మైక్రోమ్యాక్స్ IN Note 2 సేల్ ప్రారంభం
ప్రస్తుతం భారతదేశంలో కరోనా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. రోజు రోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో పార్లమెంట్ సమావేశాల్లో కోవిడ్ నిబంధనలు అమలు కానున్నాయి. ఉభయ సభలకు చెందిన సభ్యులు విడివిడిగా కూర్చునే విధంగా ఏర్పాట్లు చేశారు. సోమవారం ఉదయం 11 గంటలకు సెంట్రల్ హాల్ లో ఉభయసభల సభ్యులనుద్దేశించి రాష్ట్రపతి రామనాధ్ కోవింద్ ప్రసంగించనున్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకు లోక్ సభ లో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం చేయనున్నారు. అనంతరం బడ్జెట్ ను ప్రవేశపెడుతారు.
Read More : Protests in Canada: నిరసనలతో అట్టుడుకుతున్న కెనడా.. కుటుంబంతో సహా అజ్ఞాతంలోకి ప్రధాని
మరోవైపు…భారతదేశంలో కరోనా తగ్గుముఖం పడుతున్నట్లే కనిపిస్తోంది. శనివారం ఉదయం 8 గంటల నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకు కొత్తగా 2,34,281 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 24 గంటల్లో 893 మంది చనిపోయారని, ఇప్పటి వరకు ఈ వైరస్ బారిన మృతి చెందిన వారి సంఖ్య 4,94,091 వరకు చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 18,84,937 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. రోజువారీ పాజిటివిటీ 14.50% శాతానికి చేరుకోగా.. వారాంతపు పాజిటివిటీ రేటు 16.40% శాతంగా ఉంది. దేశ వ్యాప్తంగా కరోనా వాక్సిన్ పంపిణీ కొనసాగుతుంది. ఇప్పటివరకు 165.70 కోట్ల వాక్సిన్ డోసులు వేసినట్లు కేంద్ర వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది.