లలితా జువెలర్స్ లో దొంగతనం.. 13కోట్లు దోపిడీ

లలితా జువెలర్స్ లో దొంగతనం చోటుచేసుకుంది. తమిళనాడు తిరుచుపరిపల్లిలోని లలితా జువెలర్స్ బ్రాంచ్ లో వెనకభాగంలో పెద్ద రంద్రం చేసిన దొంగలు రూ.13కోట్ల విలువగల బంగారు, వజ్రాల నగలను ఎత్తుకెళ్లారు.
ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇద్దరు దొంగలు జంతువుల ముసుగులు దరించి దొంగతనం చేసినట్లు సీసీకెమెరాలో రికార్డ్ అయింది.
ఈ ఘటన మంగళవారం(01 అక్టోబర్ 2019) రాత్రి 2గంటల నుంచి 3 గంటల ప్రాతంలో జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. తిరుచ్చి పోలీస్ కమిషనర్ ఏ.అమల్ రాజ్, సెంట్రల్ జోన్ ఐజీ వరదరాజు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఫోరెన్సిక్ టీం క్లూస్ సేకరించింది.
తిరుచ్చిలో ఇది రెండవ పెద్ద దొంగతనం. మొదటిది పంజాబ్ నేషనల్ బ్యాంకులో జనవరిలో జరిగిన దొంగతనంలో రూ. 19లక్షల నగదు, 470 బంగారు కాయిన్ల దొంగతనం జరిగింది.