దీపావళికి బంగారం,వెండి కాదు ఇనుప కత్తులు కొనండి

త్వరలో రాబోయే దీపావళికి బంగారం, వెండి పాత్రలకు బదులుగా దేశంలోని హిందువులందరూ ఇనుముతో చేసిన కత్తులు కొనాలని సూచించారు యూపీ కి చెందిన బీజేపీ నాయకుడు గజరాజ్ రాణా. నవంబర్ నెలలో అయోధ్యపై తీర్పు రానుంది. ఈ సమయంలో గజరాజ్ రాణా వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
కోర్టు తీర్పు హిందువులకు అనుకూలంగా వస్తుందని చెపుతూనే… తీర్పు ఎలా వచ్చినా, ప్రస్తుతమున్న పరిస్థితుల్లో తీవ్ర మార్పులొస్తాయని, అందుకోసం ముందు జాగ్రత్తగా, ఆత్మ రక్షణ కోసం ఆయుధాలు అవసరమని గజరాజ్‌రాణా అభిప్రాయపడ్డారు.
మన పురాణాల్లోనూ దేవతలు, దేవుళ్లు అవసరమైనప్పుడు ఆయుధాలు ధరించి ధర్మరక్షణకు పోరాటం చేశారని, ఆ విధంగానే నా వ్యాఖ్యలను చూడాలని, దీనికి వేరే అర్ధములు ఆపాదించవద్దని ఆయన కోరారు. గజరాజ్ వ్యాఖ్యలపై .. యూపీ బేజేపీ నేత చంద్రమోహన్ మాట్లాడుతూ…గజరాజ్ వ్యాఖ్యలు ఆయన స్వంత అభిప్రాయమని, పార్టీకీ ఎటువంటి సంబంధం లేదని అన్నారు. రాణా గతంలోనూ….ముస్లింల పవిత్ర ప్రదేశమైన మక్కాలో శివలింగం ఉందని, ఒకప్పుడు హిందువులు అక్కడ నివాసముండేవారని, మరోక సందర్భంలో ముస్లింలను ఊటంకిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.