స్టిల్ బ్యాచిలర్ : సార్ కాదు.. రాహుల్ అని పిలవండి

  • Published By: veegamteam ,Published On : March 13, 2019 / 11:55 AM IST
స్టిల్ బ్యాచిలర్ : సార్ కాదు.. రాహుల్ అని పిలవండి

చెన్నై: దేశ రాజకీయాల్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే తడుముకోకుండా చెప్పేది కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అని. రాహుల్ గాంధీ పెళ్లిపై ఒకప్పుడు పెద్ద చర్చే జరిగింది. రాహుల్ గాంధీని ప్రధాని ఎప్పుడు అవుతారు? అని అడిగేవాళ్లకంటే.. పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? అని అడిగేవాళ్లే ఎక్కువ.. ప్రస్తుతం రాహుల్ గాంధీ వయసు 48 ఏళ్లు. అయినా ఆయన ఇంకా బ్యాచిలర్ గానే ఫీల్ అవుతున్నారు. ఏజ్ పెరుగుతున్నా కుర్రాడిలానే భావించుకుంటున్నారు.
Read Also : అందరినీ గెలికేశాడు : మోడీ ట్వీట్లకు…విపక్షాలు మోత మోగించాయి

ఎన్నికల ప్రచారంలో భాగంగా చెన్నైలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ.. అక్కడ స్టెల్లా మేరీస్ ఉమెన్స్ కాలేజీలో విద్యార్థులతో భేటీ అయ్యారు. పలు అంశాలపై వారితో ముచ్చటించారు. ఈ క్రమంలో సరదా సన్నివేశం చోటు చేసుకుంది. రాహుల్ చేసిన కామెంట్ నవ్వులు పూయించింది.

విద్యార్థులతో ఇంటరాక్ట్ అవుతున్న సమయంలో.. ఓ అమ్మాయి లేచి రాహుల్ ని ప్రశ్న అడగబోయింది. రాహుల్ సార్ అని ఏదో చెప్పబోయింది. వెంటనే స్పందించిన రాహుల్ గాంధీ.. నన్ను సార్ అనొద్దు.. రాహుల్ అని పిలువు… అలా పిలిస్తే ఎక్కువ కంఫర్ట్ గా ఉంటుంది అని రాహుల్ గాంధీ అన్నారు. రాహుల్ గాంధీ అలా అనేసరికి అక్కడ ఒక్కసారిగా నవ్వులు విరబూశాయి. వయసుతో నిమిత్తం లేదు.. పెళ్లి కాకపోతే చాలు బ్యాచిలర్ అనే ఫీలింగ్ ను రాహుల్ గాంధీ వ్యక్తం చేశారు.