దేశ రాజధానిని గెలిచేందుకు బీజేపీ 22ఏళ్ల పోరాటం వృథా

దాదాపు ఢిల్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ పూర్తి కావొచ్చింది. దేశ రాజధానిలో అధ్యక్షత వహించాలని బీజేపీ 22ఏళ్ల నిరీక్షణ మరోసారి వాయిదా పడే వాతావరణం కనిపిస్తోంది. అదే జరిగితే మరో ఐదేళ్లు ఆప్ పాలనలో ఢిల్లీ ఉండటం ఖాయం. రెండో సారి ఆప్ అద్భుతమైన మెజార్టీతో గెలుపొందుతుందని ఫలితాలు చెప్తున్నాయి.
ఢిల్లీలో 1998నుంచి బీజేపీకి అధికారం దక్కలేదు. సుష్మా స్వరాజ్ ఆధ్యక్షతన కొద్ది రోజులు మాత్రమే ఢిల్లీకి సీఎంగా బీజేపీ అభ్యర్థి కొనసాగారు. ఢిల్లీ సీఎం సీటుపై బీజేపీ కండువా వేయాలని 22ఏళ్లుగా ప్రయత్నించి విఫలమవుతూనే ఉన్నారు. ఈ సారి ఓటమికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. ఉల్లిధర పెంచేయడం ఎక్కువ ప్రభావమే చూపించింది.
1998 తర్వాత షీలా దీక్షిత్ కాంగ్రెస్ పార్టీ తరపున 2013వరకూ నాయకత్వం వహించి ఢిల్లీని అభివృద్ధి చేశారు. ఆ సమయంలో లంచగొండితనం, అవినీతి పెరిగిపోయాయనే ఆరోపణలను అవకాశంగా చేసుకుని ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది. ఢిల్లీలో దశాబ్ద కాలం నుంచి జరుగుతున్న పరిణామాలు జాతీయ అంశాలు, స్థానిక అంశాలకు తేడాను చూపిస్తున్నాయి.
2019లోక్ సభ ఎన్నికలను బీజేపీ సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసింది. కేవలం ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలే ఆప్‌కు పట్టం గట్టాయి. ఢిల్లీలో ఈ మాత్రం ఓట్లు దక్కాయంటే అది మోడీ మ్యాజిక్ అనే చెప్పాలి. ఎన్నికలకు ముందు సీఎం అభ్యర్థిని ప్రకటించి పోటీకి దిగాలి అని సవాల్ చేసినా బీజేపీ పార్టీ ముఖం చూపించి గెలవడానికే ప్రయత్నించింది..