కరోనా దెబ్బ తట్టుకునేందుకు…ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించనున్న కేంద్రం

కరోనా వైరస్(COVID-19) ప్రభావం దేశంలోని అనేకరంగాలపై భారీగానే పడింది. టూరిజం,సినిమా రంగం,ఆతిథ్య రంగం వంటివి తీవ్రంగా నష్టపోయిన వాటిలో ముఖ్యంగా ఉన్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా సినిమా థియేటర్లు కూడా మూసివేయబడ్డాయి. దాంతో ఆ రంగంవారు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రంగాలు ప్రభుత్వం ఉద్దీపన ప్యాకేజీ ప్రకటిస్తుందని ఎక్కువగా అంచచాలు పెట్టుకున్న సమయంలో అతి త్వరలో కేంద్రప్రభుత్వం ఎకనామిక్ ప్యాకేజీ ప్రకటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటును నరేంద్రమోడీ ప్రకటించారు. దాని పేరును కోవిడ్-19 ఎకనామిక్ రెస్ఫాన్స్ ప్యాకేజీ అని మోడీ చెప్పారు.
COVID-19 తో పోరాడటానికి ఇచ్చిన విరాళాలను “కార్పొరేట్ సోషల్ రెస్ఫాన్సుబులిటీ(CSR)” గా లెక్కించనున్నట్లు నిర్మలా సీతారామన్ ఇప్పటికే ప్రకటించారు. CSR ఫండ్స్ ను కోవిడ్-19 కొరకు ఖర్చు చేయడం అనేది CSR యాక్టివిటీకి ఎలిజిబుల్ అవుతుందని,ఇండియా ఫైట్ కరోనా అనే హ్యాష్ ట్యాగ్ తో నిర్మలా సీతారామన్ ఓ ట్వీట్ కూడా చేశారు.
సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్ బోర్డ్(సెబీ) సమ్మతి నిబంధనలను సడలించడం వంటి వాటి గురించి కూడా నిర్మలా తన ట్వీట్ లో ప్రస్తావించారు. మహమ్మారిగా డబ్యూహెచ్ వో ప్రకటించిన కరోనా వైరస్ ను భారత ప్రభుత్వం జాతీయ విపత్తుగా గుర్తించిన విషయం తెలిసిందే. కరోనా నేపథ్యంలె గత గురువారం జాతినుద్దేశించి ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేసిన ప్రసంగంలో…ప్రపంచ ఆర్థికవ్యవస్థపై ఇప్పటికే కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా పడిందని అన్నారు.
అయితే భారత్ పై కరోనా ప్రభావం ఎంతో ఇంకా విశ్లేషించాల్సి ఉంది. చైనాలోని వూహాన్ నగరంలో కరోనా వైరస్ వెలుగులోకి వచ్చినప్పటినుంచి ప్రపంచవ్యాప్తంగా ఎకానమీ తీవ్రంగా దెబ్బతినింది. పెద్ద ఎయిర్ లైన్స్ సంస్థల నుంచి చిరు వ్యాపారుల వరకు అన్ని రంగాల వాళ్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
See Also | కరోనా వ్యాప్తి నిరోధానికి సుప్రీం కీలక నిర్ణయం