New Governors: హర్యానాకు దత్తాత్రేయ.. కర్నాటకకు కొత్తగా..!
కేంద్ర కేబినెట్‌లో మార్పులు చేయబోతున్నట్లుగా వార్తలు వస్తుండగా.. అంతకుముందుగానే కేంద్రం రాష్ట్రాల గవర్నర్‌ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.

Centre Announces List Of New Governors For Karnataka Goa And Others3
Centre announces list of new governors: కేంద్ర కేబినెట్‌లో మార్పులు చేయబోతున్నట్లుగా వార్తలు వస్తుండగా.. అంతకుముందుగానే కేంద్రం రాష్ట్రాల గవర్నర్‌ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాలకు కొత్తగా గవర్నర్లను, ఉన్నవారిని మారుస్తూ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరు వ్యక్తుల విషయంలో కీలక మార్పులు చేసింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షుడు, మాజీ కేంద్రమంత్రి, ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్‌గా ఉన్న బండారు దత్తాత్రేయను హర్యానా రాష్ట్రానికి గవర్నర్‌గా నియమిస్తూ కీలక ఉత్తర్వులు విడుదల చేసింది. అలాగే మాజీ ఎంపీ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రాష్ట్రశాఖ అధ్యక్షునిగా పనిచేసిన తెలుగు బీజేపీ నేత కంభంపాటి హరిబాబును కూడా గవర్నర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. కంభంపాటి హరిబాబు మిజోరం గవర్నర్‌గా నియమితులయ్యారు.
కొత్తగా మారిన గవర్నర్లు..
మిజోరం గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు
కర్నాటక గవర్నర్‌గా థావర్‌చంద్ గెహ్లోట్,
మధ్యప్రదేశ్ గవర్నర్‌గా మంగూభాయ్ చాగన్‌భాయ్ పటేల్
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్
మిజోరాం గవర్నర్ పిఎస్ శ్రీధరన్ పిళ్ళై గోవా గవర్నర్‌గా నియమితులయ్యారు
త్రిపుర గవర్నర్‌గా హర్యానా గవర్నర్ సత్యదేవ్ నారాయణ్ ఆర్యను నియమించారు
త్రిపుర గవర్నర్ రమేష్ బైస్‌ను జార్ఖండ్ గవర్నర్‌గా నియమించారు
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రయను హర్యానా గవర్నర్‌గా నియమించారు