దేశమంతా షట్ డౌన్.. బయట కనిపిస్తే లోపలెయ్యండి: రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు

  • Published By: vamsi ,Published On : March 23, 2020 / 06:20 AM IST
దేశమంతా షట్ డౌన్.. బయట కనిపిస్తే లోపలెయ్యండి: రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు

Updated On : March 23, 2020 / 6:20 AM IST

ప్రపంచదేశాలను భయాందోళనకు గురిచేస్తున్న కరోనా వైరస్.. మన దేశంలో కూడా ఊహించనంత వేగంగా విస్తరిస్తుంది. ఇప్పటికే ఈ వైరస్ 416మందికి సోకగా.. కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమయ్యింది. ఈ క్రమంలోనే కొద్దిసేపటి క్రితం రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రాలన్నీ లాక్‌డౌన్ చేయాలంటూ.. అత్యవసరమైన విషయాలకు తప్పితే, ఎవరైనా బయట తిరిగితే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.

ఇప్పటి వరకు సమస్యాత్మకంగా అనిపించిన 75 జిల్లాల్లోనే లాక్‌డౌన్ ప్రకటించగా దేశంలోని అన్ని రాష్ట్రాలను లాక్‌ డౌన్ చేయాలంటూ లేటెస్ట్‌గా కేంద్రం ఆదేశించింది. కరోనా వైరస్ కేసులు ఊపందుకోవడంతో చైనా, ఇటలీ తరహాలో పరిస్థితి చేయి దాటిపోకుండా కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో పరిస్థితిని అదుపులో ఉంచేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. 

మొత్తం కరోనా పాజిటివ్ కేసుల్లో దేశంలో మృతుల సంఖ్య 2 శాతంగా ఉంది. అంటే ఇది దాదాపు చైనాకు సమానం. భారత్‌లో మృతుల సంఖ్య పెరగకుండా అత్యంత సమర్థంగా పనిచేస్తున్నారు. ఇండియాలో మహారాష్ట్రలో ఇప్పటికి 74 కేసులు నమోదు అవగా.. ఆ రాష్ట్రమే టాప్‌లో ఉంది. తర్వాత కేరళ 67 కేసులతో రెండో స్థానంలో ఉండగా.. ఆ రెండు రాష్ట్రాల్లో వైరస్ మూడో దశకు చేరినట్లు భావిస్తున్నారు. 

Govt

See Also | కరోనా అనుమానంతో సెల్ఫ్ ఐసోలేషన్‌కు దేశాధినేత