సంప్రదాయం : కొరడా దెబ్బలు తిన్న సీఎం

  • Published By: chvmurthy ,Published On : October 29, 2019 / 11:02 AM IST
సంప్రదాయం : కొరడా దెబ్బలు తిన్న సీఎం

Updated On : October 29, 2019 / 11:02 AM IST

సంప్రదాయం పేరుతో కోరడా దెబ్బలు తిన్నారు ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి. చత్తీస్ ఘడ్ సీఎం భూపేష్ భగల్ సోమవారం, అక్టోబరు28న గోవర్ధనపూజ సందర్భంగా రాయ్‌పూర్‌లోని కోట జంజ్‌గిరికి దగ్గరలో ఉన్న ఓ ఆలయాన్ని సందర్శించారు. అక్కడ ఆయన గోవర్ధనపూజ చేశారు.  ఆలయ సంప్రదాయం ప్రకారం అమ్మవారి ఎదుట పూజారి చేతిలో కొరడా దెబ్బలు తింటే మంచిదని స్ధానికుల నమ్మకం.

జానపద సంప్రదాయం కొరడాతో కొట్టుకోవడం ఆనవాయితీగా వస్తోందని తెలుసుకున్న సీఎం తాను కూడా కొరడా దెబ్బలు తింటానన్నారు.పూజ అనంతరం ఆలయ పూజారి కూడా సీఎంను సామాన్య భక్తుడిగానే తలిచి కొరడాతో కొట్టాడు. ఆరుసార్లు కొరడా దెబ్బలు తినగానే సీఎం ఇంక చాలు అన్నట్లు  చెయ్యి  వెనక్కి తీసుకున్నారు.  కొరడాతో కొడుతున్నప్పడు సీఎం సంతోషంగానే కనిపించారు. సీఎంను కొరడాతో కొట్టటానికి ముందు, తర్వాత పూజారి సీఎం కు నమస్కరించాడు.

ఈ సమయంలో భూపేష్ భగల్ సాంప్రదాయ దుస్తుల ధోతి, కుర్తా ధరించి కనిపించారు. తర్వాత పూజారిని ఆత్మీయంగా అలింగనం చేసుకుని గుడి నుంచి బయటకు వెళ్లిపోయారు. కాగా ఈ జానపద పండుగ ప్రతి సంవత్సరం దీపావళికి చేసే లక్ష్మి పూజల తరువాత జరుపుకుంటారు.