చిల్డ్రన్స్ డే స్పెషల్: స్కూళ్ల నుంచి స్వేచ్ఛ కావాలంటోన్న బాలిక వైరల్ వీడియో

చిల్డ్రన్స్ డే స్పెషల్: స్కూళ్ల నుంచి స్వేచ్ఛ కావాలంటోన్న బాలిక వైరల్ వీడియో

Updated On : November 14, 2019 / 6:47 AM IST

‘ఈ స్కూళ్లు ఏంటి.. ఈ తంతు అస్సలేం అర్థం కావడం లేదు. ఒక్క రోజు కూడా విశ్రాంతి లేకుండా చంపేస్తున్నారు. మాకు స్వేచ్ఛ కావాలి’ అని ఓ బాలిక అరుస్తూ ఎవరొచ్చినా కడిగిపారేస్తానంటోన్న వీడియో వైరల్ గా మారింది. 

రోజూ ఉదయం ఆరు గంటలకు లేపి స్కూల్ కు రెడీ చేస్తారు. నెల మొత్తం అంతే, ముందు ప్రేయర్, తర్వాత ఇంగ్లీష్, తర్వాత లెక్కలు, తర్వాత ఈవీఎస్, తర్వాత గుజరాతి, తర్వాత జీకే ఇలా ఎన్ని నేర్పుతారు. అని బాలిక ఆవేశంతో ఊగిపోతున్న వీడియోను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. 

ఇంకా ఆ వ్యక్తి బాలికను స్కూలింగ్ అనే కాన్సెప్ట్ అందుబాటులోకి తీసుకొచ్చిన వ్యక్తి నీకు ఎదురైతే ఏం చేస్తావని అడిగిన ప్రశ్నకు ‘వాడిని పూర్తిగా కడిగి, నీళ్లలో పడేసి ఇస్త్రీ చేస్తా’ అని హెచ్చరించింది. చిల్డ్రన్స్ డే కు ముందు రోజు నవంబరు 13న షేర్ చేసిన వీడియో వైరల్ గా మారిపోతుంది. 

దీనిని ఇప్పటికే 2లక్షల 60వేల మంది చూడగా, 9వేలకు పైగా లైక్ లు వచ్చాయి. ఆ బాలిక చెప్తోన్న స్టైల్ అందరినీ ఆకట్టుకుంటోంది. పాపం చిన్నారి కష్టాలు అంటూ కామెంట్లు పెడుతున్నారు. మేం కూడా స్కూల్ టైంలో ఇలానే అనుకునేవాళ్లం అని గుర్తు చేసుకుంటున్నారు.