CAA నిరసనలు : పలు రైళ్లు రద్దు

పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసన జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో నిరసనలు హింసాత్మకంగా మారుతున్నాయి. ఆందోళనలతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయంఏర్పడింది.
ఆందోళనల నేపధ్యంలో విశాఖ మీదుగా వెళ్లాల్సిన పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోన్నారు. విశాఖ నుంచి రద్దు చేసిన రైళ్ల వివరాలు చెన్నై హౌరా,బెంగుళూరు సూపర్ ఫాస్ట్,హౌరా సూపర్ ఫాస్ట్,ఫలక్ నుమా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ లను రద్దు చేశారు.
మంగళవారం వెళ్లాల్సిన కోరమాండల్ చెన్నై, కన్యాకుమారి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైళ్లనుకూడా రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. రద్దైన రైళ్ళ టికెట్ చార్జీలను ప్రయాణికులకు తిరిగి ఇవ్వనున్నట్లు అధికారులుస్పష్టం చేశారు.