ఫ్రీగా ఇస్తారు : 9,10 విద్యార్థులకు ల్యాప్ టాప్ లు

  • Published By: veegamteam ,Published On : January 7, 2019 / 08:28 AM IST
ఫ్రీగా ఇస్తారు : 9,10 విద్యార్థులకు ల్యాప్ టాప్ లు

విద్యార్ధులకు చిన్న వయస్సు నుంచే  కంప్యూటర్ జ్ణానాన్ని అందించాలని తమిళనాడు ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అందులో భాగంగానే ఉచిత ల్యాప్ టాప్ ల పంపిణీ పథకాన్ని పొడిగించి రాష్ట్రవ్యాప్తంగా గవర్నమెంట్, దాని అనుబంధ స్కూళ్లలో 9,10వ తరగతి చదివే విద్యార్థులకు ఉచితంగా ల్యాప్ టాప్ లు అందించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ విషమయై ఆదివారం(జనవరి-6,2019) రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కేఏ సెంగొట్టియాన్ అధికారంకంగా ఓ ఇంటిమెషన్ ఇచ్చారు. సెక్రటేరియట్ లోని అధికారులు తెలిపిన వివరాల ప్రకారం… విద్యార్థులకు ఉచిత ల్యాప్ టాప్ ల పంపిణీ విషయమై మంత్రిగారు ఇప్పటికే విద్యాశాఖ అధికారులతో చర్చించారని, ఆర్థిక ఆమోదం కోసం ఆ ప్రపోజల్ ను కేంద్రానికి పంపించారని సెక్రటేరియట్ వర్గాలు తెలిపాయి. 
తమిళనాడు దివంగత మాజీ సీఎం జయలలిత మొదటిసారిగా 2011-12 విద్యాసంవత్సరంలో 12వ తరగతి విద్యార్థులకు ఉచిత ల్యాప్ టాప్ ల పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆ తర్వాత 11వ తరగతి విద్యార్ధులను కూడా ఈ స్కీమ్ యాడ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 38 లక్షలకు పైగా ల్యాప్ టాప్ లను తమిళనాడు ప్రభుత్వం విద్యార్థులకు అందించింది.