“ఏదీ ఏమైనా సరే”…పౌరసత్వ చట్టంపై వెనక్కి తగ్గేదే లేదు

పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో హింసాత్మక ఆందోళనలు కొనసాగుతున్న సమయంలో కేంద్రహోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. ఈ చట్టంపై తాము వెనక్కి తగ్గే ప్రశక్తే లేదన్నారు. ఇప్పటికే పంజాబ్,కేరళ,మధ్యప్రదేశ్,చత్తీస్ ఘడ్,వెస్ట్ బెంగాల్ సీఎంలు ఈ చట్టం అమలు చేయబోమని చేస్తున్న ప్రకటనలను పరోక్షంగా ప్రస్తావిస్తూ..కేంద్రప్రభుత్వం తన అధికారాలను ఉపయోగడించి పొరుగుదేశాల్లో వేధింపులు ఎదుర్కొన్ని వచ్చిన శరణార్థులకు పౌరసత్వం ఇచ్చి తీరుతామన్నారు.
ఢిల్లీలోని ద్వారకా లో నిర్వహించిన ఓ ర్యాలీలో షా మాట్లాడుతూ…ఏది ఏమైనా..మోడీ ప్రభుత్వం శరణార్థులకు భారత పౌరసత్వం ఇచ్చి తీరుతుంది. శరణార్థులు గౌరవంతో భారతీయులుగా జీవించేలా మోడీ సర్కార్ వారికి హామీ ఇస్తున్నామని షా అన్నారు. డిసెంబర్-31,2014కి ముందు పాకిస్తాన్,ఆప్ఘనిస్తాన్,బంగ్లాదేశ్ లో కి వచ్చిన ముస్లిమేతరులకు భారతీయ పౌరసత్వం ఇచ్చేందుకు కేంద్రం పౌరసత్వ సవరణ చట్టం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ చట్టం మతతత్వ మార్గాలపై వివక్ష చూపుతోందని హక్కుల కార్యకర్తలు, ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి.
ఈ చట్టం తమ ప్రాంతంలోకి అక్రమ వలసదారుల కోసం ఫ్లడ్‌గేట్లను తెరిచిందని ఈశాన్య రాష్ట్రాల్లోని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాల్లో మొదలైన ఆందోళనలు క్రమక్రమంగా దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. పలుచోట్ల ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్న విషయం తెలిసిందే.