Karnataka: ఆర్ఎస్ఎస్ పాఠాలు తొలగించి అంబేద్కర్ పాఠాలు తిరిగి ప్రవేశపెట్టిన కర్ణాటక ప్రభుత్వం

వాస్తవానికి గత బీజేపీ ప్రభుత్వం చేసిన చట్టాలన్నీ కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేస్తోంది. కర్ణాటక విద్యాశాఖ మంత్రి మధు బంగారప్ప ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తూ "గత సంవత్సరం వారు (గత బీజేపీ ప్రభుత్వం) మార్పులు చేశారు. గతంలో ఉన్నవాటినే మేము తిరిగి ప్రవేశపెట్టాము" అన్నారు.

Karnataka: ఆర్ఎస్ఎస్ పాఠాలు తొలగించి అంబేద్కర్ పాఠాలు తిరిగి ప్రవేశపెట్టిన కర్ణాటక ప్రభుత్వం

Karnataka: కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ హయాంలో ప్రవేశ పెట్టిన ఆర్ఎస్ఎస్ పాఠాలను తొలగించి, ఆ సమయంలో తొలగించిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పాఠాలను తిరిగి ప్రవేశ పెట్టేందుకు చేసిన సవరణకు కర్ణాటక కేబినెట్ గురువారం ఆమోదం తెలిపింది. రాష్ట్ర పాఠశాలల్లో కన్నడ, సాంఘిక శాస్త్రంపై పాఠ్యపుస్తకాల్లో ఉన్న ఈ పాఠాలను తొలగించేందుకు సిద్ధరామయ్య ప్రభుత్వం సిద్ధమైంది. ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకుడు కేశవ్ బలిరామ్ హెడ్గేవార్‌పై అధ్యాయాలను తొలగిస్తూ సావిత్రిబాయి ఫూలే, చక్రవర్తి సూలిబెలే, జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీకి రాసిన లేఖలు సహా బీఆర్ అంబేద్కర్‌పై కవితలను తిరిగి చేర్చనున్నారు.

Maharashtra Politics: శివసేనపై మెత్తబడ్డ బీజేపీ.. అన్నదమ్ముల ఫైట్ అంటూ కవరింగ్

వాస్తవానికి గత బీజేపీ ప్రభుత్వం చేసిన చట్టాలన్నీ కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేస్తోంది. కర్ణాటక విద్యాశాఖ మంత్రి మధు బంగారప్ప ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తూ “గత సంవత్సరం వారు (గత బీజేపీ ప్రభుత్వం) మార్పులు చేశారు. గతంలో ఉన్నవాటినే మేము తిరిగి ప్రవేశపెట్టాము” అన్నారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు కన్నడ, సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకాలపై సవరణలు ఉంటాయట. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన పాఠ్యపుస్తకాలు ఇప్పటికే పంపిణీ చేసినందున, కొత్త పాఠాలు అనుబంధ గ్రంథాలుగా బోధిస్తారట.

Karnataka Politics: ముఖ్యమంత్రి కుర్చీపై మళ్లీ మొదటికి వచ్చిన సీనియర్ నేత.. ‘దళితుడిని కాబట్టే అడ్డుకున్నారంటూ’ వివాదాస్పద వ్యాఖ్యలు

ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోకు అనుగుణంగా పాఠ్యపుస్తకాల సవరణ జరిగింది. బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు పాఠశాల పాఠ్యపుస్తకాల్లో చేసిన మార్పులను రద్దు చేస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చింది. పాఠశాలలు, కళాశాలల్లో పాడే సాధారణ శ్లోకాలతో పాటు రాజ్యాంగ ప్రవేశికను తప్పనిసరిగా చదవాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించిందని కర్ణాటక చట్టం హెచ్‌కే పాటిల్ తెలిపారు.