Rahul Gandhi : ధరల పెరుగుదలలో వికాసం కనిపిస్తోంది

దేశంలో పెరుగుతోన్న పెట్రోల్​ ధరల నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ..కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

Rahul Gandhi : ధరల పెరుగుదలలో వికాసం కనిపిస్తోంది

Congress Leader Rahul Gandhi Slams Government For Rise In Fuel Prices

Updated On : June 7, 2021 / 5:11 PM IST

Rahul Gandhi దేశంలో పెరుగుతోన్న పెట్రోల్​ ధరల నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ..కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. పలు నగరాల్లో పెట్రోల్‌ ధర వంద రూపాయలు దాటిపోయిన నేపథ్యంలో మోడీ సర్కార్ ని విమర్శిస్తూ సోమవారం రాహుల్ ఓ ట్వీట్ చేశారు.

పలురాష్ట్రాల్లో ఆన్‌లాక్‌ ప్రక్రియ ప్రారంభమైంది. పెట్రోల్‌ పంపుల్లో డబ్బులు చెల్లించేటప్పుడు మోడీ ప్రభుత్వ హయాంలో ధరల పెరుగుదలలో వికాసం కనిపిస్తుందని. దేశంలో పన్నువసూళ్ల విపత్తు నిరాంతరాయంగా కొనసాగుతోంది అని రాహుల్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.

మరోవైపు,పెట్రోల్‌ ధరల పెరుగుదలను అధికమైన ప్రజాదోపిడీగా అభివర్ణించారు కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణదీప్‌ సుర్జేవాలా. దీనికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. అధిక దోపిడీ కారణంగా 13నెలల వ్యవధిలో పెట్రోల్‌ ధర రూ.25.72, డీజిల్‌ రూ.23.93 పెరిగినట్లు రణదీప్ సుర్జేవాలా తెలిపారు.

Read::Rahul Gandhi: ట్విట్టర్​లో 50 మందిని అన్​ఫాలో చేసిన రాహుల్.. అసలేమైంది?