Congress Loosing Power : మరింత దిగజారిన కాంగ్రెస్.. నాడు 13.. నేడు 2 రాష్ట్రాలకే పరిమితం
కేంద్రంలో మోదీ అధికారం చేపట్టినప్పటి నుంచి ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని ఓటములు ఎదురవుతున్నాయి.(Congress Loosing Power)

Congress Loosing Power
Congress Loosing Power : దేశమంతా ఆసక్తిగా ఎదురుచూసిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సత్తా చాటింది. ఐదింటిలో మూడు రాష్ట్రాల్లో (యూపీ, ఉత్తరాఖండ్, మణిపూర్) క్లియర్ మెజారిటీతో అధికార పగ్గాలు చేజిక్కించుకోనుంది. గోవాలో మేజిక్ ఫిగర్ కు కేవలం అడుగు దూరంలో నిలిచింది. అదే సమయంలో పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ ఫలితాలు బీజేపీ శ్రేణుల్లో నూతనోత్సహం నింపాయి. కాగా, ఈ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ ను తీవ్రంగా నిరాశపరిచాయి. కాంగ్రెస్ పరిస్థితి మరింత దిగజారింది.(Congress Loosing Power)
135 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ దాదాపు అర్ధశతాబ్దానికి పైగా భారత్‌ను పాలించింది. స్థానికంగా కొత్తగా ఎన్ని పార్టీలు పుట్టుకొచ్చినా బలమైన క్యాడర్‌తో దశాబ్దాల పాటు పలు రాష్ట్రాలను ఏకధాటిగా ఏలింది. సోనియాగాంధీ రాకతో పూర్వవైభవం వచ్చిందనుకున్న ఆ పార్టీకి.. నరేంద్ర మోదీ ఎంట్రీ చెక్ పెట్టినట్లు అయ్యింది. కేంద్రంలో మోదీ అధికారం చేపట్టినప్పటి నుంచి ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని ఓటములు ఎదురవుతున్నాయి. తాజాగా పంజాబ్‌లోనూ అధికారాన్ని కోల్పోయిన కాంగ్రెస్.. దేశవ్యాప్తంగా మరింత గడ్డు పరిస్థితిని ఫేస్ చేస్తోంది.
UP Congress : ప్చ్ ప్రియాంక..! కాంగ్రెస్ ఓటమికి కారణాలివే..!
ప్రధానిగా మన్మోహన్ సింగ్, అధ్యక్షురాలిగా సోనియాగాంధీ ఉన్న సమయంలో దేశ రాజకీయాల్లో మరోసారి బలమైన శక్తిగా కాంగ్రెస కొనసాగింది. ఇలా 2011 నాటికి 11 రాష్ట్రాల్లో (రాజస్తాన్, ఢిల్లీ, హరియానా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ (ఉమ్మడి), కేరళతోపాటు ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, మణిపుర్, మిజోరం) కాంగ్రెస్ ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. మరుసటి ఏడాది ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లోనూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. మొత్తం 13 రాష్ట్రాల్లో తన సత్తా చాటింది.
శతాబ్ద కాలానికి పైగా ఘన చరిత్ర కలిగి, గ్రాండ్ ఓల్డ్ పార్టీగా పిలవబడే కాంగ్రెస్ రోజురోజుకూ తన ప్రాభవాన్ని కోల్పోతోంది. దేశంలో ఏ ప్రాంతంలో, ఏ ఎన్నికలు జరిగినా ఓటమిపాలు కావడం కామన్ గా మారింది. రీసెంట్ గా జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో.. ఒక్క రాష్ట్రంలో కూడా అధికారంలోకి రాలేకపోయింది కాంగ్రెస్.
2012లో దేశంలో 13 రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఇప్పుడు కేవలం రెండు రాష్ట్రాలకే పరిమితం కానుంది. రాజస్తాన్, చత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో పవర్ లో ఉండనుంది. ఈ ఫలితాలు కాంగ్రెస్ శ్రేణులను విస్మయానికి గురి చేశాయి. ఇప్పటికైనా కాంగ్రెస్ అధినాయకత్వం మేల్కోవాలని.. పార్టీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది రాజకీయ విశ్లేషకుల మాట.
AAP in Punjab: పంజాబ్ ను కైవసం చేసుకున్న “ఆమ్ ఆద్మీ”: సక్సెస్ సీక్రెట్
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ కు దారుణ ఫలితాలు రావడం పట్ల రాహుల్ గాంధీ స్పందించారు. ప్రజల తీర్పును సవినయంగా అంగీకరిస్తున్నామని తెలిపారు. వివిధ రాష్ట్రాల్లో గెలుపొందిన వారికి అభినందనలు తెలుపుతున్నట్టు వెల్లడించారు. ఈ ఎన్నికల కోసం అంకితభావంతో కృషి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలకు, అభిమానులకు కృతజ్ఞతలు చెప్పారు రాహుల్ గాంధీ. ఈ ఎన్నికల ఫలితాలతో పాఠాలు నేర్చుకుంటామని, ప్రజా సంబంధ అంశాలపై పోరాటం కొనసాగిస్తామని రాహుల్ గాంధీ వెల్లడించారు.
Uttar Pradesh 2022 : యూపీ నా అడ్డా అంటున్న యోగీ.. మెజార్టీకి 15 పాయింట్స్