ఆప్ తో పొత్తు…రెండుగా చీలిన ఢిల్లీ కాంగ్రెస్

  • Published By: venkaiahnaidu ,Published On : April 3, 2019 / 02:06 PM IST
ఆప్ తో పొత్తు…రెండుగా చీలిన ఢిల్లీ కాంగ్రెస్

Updated On : April 3, 2019 / 2:06 PM IST

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)తో పొత్తు పెట్టుకోకుంటే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనంటూ మాజీ ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ మాకెన్ సంచలన ప్రకటన చేశారు. ఢిల్లీ లోక్‌సభ స్థానాలకు సంబంధించి ఆశావహుల జాబితాను పంపించాలని కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ మాకెన్‌ ను కోరింది. ఈ సందర్భంగా మాకెన్ మాట్లాడుతూ… ఆప్‌ తో పొత్తు ఉంటేనే తాను ఎన్నికల్లో పోటీ చేస్తానని పార్టీకి తేల్చి చెప్పారు.న్యూఢిల్లీ లోక్ సభ స్థానం  మాకెన్ రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికైన విషయం తెలిసిందే.

ఆప్‌ తో పొత్తుపై ఢిల్లీ కాంగ్రెస్ రెండు వర్గాలుగా విడిపోయింది.ఢిల్లీ ప్రస్తుత కాంగ్రెస్ అధ్యక్షురాలు షీలాదీక్షిత్ ఆప్‌ తో చేయి కలపడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.మరోవైపు అజయ్ మాకెన్ మాత్రం పొత్తు పెట్టుకోవాల్సిందేనని పట్టుబట్టారు. దీనిపై ప్రస్తుతం దిల్లీకి కాంగ్రెస్‌ ఇరు వర్గాలుగా విడిపోయి ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో కాంగ్రెస్‌ కి మొదట రెండు లోక్ సభ సీట్లు ఇచ్చేందుకు ఆప్‌ ఒప్పుకొన్నట్లు తెలుస్తోంది. హరియాణా, పంజాబ్‌ లోనూ పొత్తుకు అంగీకరిస్తే మరో స్థానం కూడా ఇవ్వడానికి ఆప్‌ అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే సీట్ల సర్దుబాటుపై అసంతృప్తి వ్యక్తం చేసిన కాంగ్రెస్ చివరకు ఒంటరిగానే పోటీ చేయడానికి నిర్ణయించుకుంది. దీంతో ఢిల్లీలోని ఏడు స్థానాలకు అభ్యర్థుల జాబితాను పంపాలని మాకెన్‌ ను పార్టీ నాయకత్వం కోరింది.