చెప్పింది మహిళా మంత్రే : వరకట్నం మన ఆచారం

వరకట్నం భారతీయ ఆచారం అని కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ అన్నారు. చట్టం మాత్రం వరకట్నం తీసుకోవటం, ఇవ్వటం నేరమంటుందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

  • Published By: sreehari ,Published On : December 28, 2018 / 09:31 AM IST
చెప్పింది మహిళా మంత్రే : వరకట్నం మన ఆచారం

Updated On : December 28, 2018 / 9:31 AM IST

వరకట్నం భారతీయ ఆచారం అని కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ అన్నారు. చట్టం మాత్రం వరకట్నం తీసుకోవటం, ఇవ్వటం నేరమంటుందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఢిల్లీ : వరకట్నం భారతీయ ఆచారం అని కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ అన్నారు. చట్టం మాత్రం వరకట్నం తీసుకోవటం, ఇవ్వటం నేరమంటుందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అందులోనూ పార్లమెంట్ లోనే. లోక్ సభలో త్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదం సందర్భంగా జరిగిన చర్చలో మహిళా మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయటం కలకలం రేపుతోంది. చట్టం చేయాల్సిన వారు.. దాన్ని పరిరక్షించాల్సిన వారే వరకట్నం ఆచారంగా భావిస్తే ఎలా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
రెండు కుటుంబాల మధ్య ఇచ్చి పుచ్చుకునే అంగీకారంతోనే జరుగుతుందని స్మృతి లోక్ సభలో వ్యాఖ్యానించారు. డిసెంబర్ 27న లోక్ సభలో జరిగిన ట్రిపుల్ తలాక్ బిల్లును ప్రతిపక్షాల నిరసనల మధ్య లోక్‌సభ ఆమోదించింది. బిల్లుకు అనుకూలంగా 245 ఓట్లు రాగా..వ్యతిరేకంగా 11 ఓట్లు వచ్చాయి. దీంతో బిల్లు ఆమోదం పొందింది. దీన్ని రాజ్యసభకు పంపాల్సి ఉండగా అక్కడ కూడా బిల్లుకు ఆమోదం లభిస్తే చట్టంగా మారుతుంది. లోక్‌సభలో ఈ బిల్లును ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. 

ట్రిపుల్ తలాఖ్ బిల్లును ప్రతిపక్షాలు విమర్శించడంపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి చట్టాలు తేవడంలో విఫలమైందని ఆరోపించారు. పెళ్లిళ్ల  సందర్భంగా తీసుకునే వరకట్నం రెండు కుటుంబాల మధ్య పరస్పర అంగీకారంతో జరుగుతుందని వ్యాఖ్యానించారామె. కాబట్టి తక్షణ ట్రిపుల్ తలాక్ వ్యవహారాన్ని కూడా ‘ఖలీఫా’గానే చూడాలని స్పష్టం చేశారు. చట్టపరంగా ట్రిపుల్ తలాక్ చెప్పడం ముమ్మాటికీ తప్పేనని తేల్చిచెప్పారు మంత్రి  స్మృతీ ఇరానీ.