సీఎం సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేకి కరోనా..అందరిలో టెన్షన్

నాకు పెద్దా..చిన్నా అనే తేడా లేదు..డబ్బున్న వాడు..పేదోడు…ఇలాంటి డిఫరెంట్ అస్సలు లేదంటోంది కరోనా వైరస్. వారు..వీరు అనే తేడా లేకుండా..అందరినీ కుమ్మేస్తోంది. సామాన్యుడి నుంచి మొదలుకుని..ధనికుడు, రాజుల వరకు ఈ వైరస్ బారిన పడుతున్నారు. ఎంతో మంది చనిపోయారు కూడా. దీంతో చాలా మంది తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
కానీ వైరస్ మాత్రం విజృంభిస్తూనే ఉంది. పలువురు ప్రజాప్రతినిధులకు సైతం వైరస్ సోకుతోంది. తాజాగా సీఎం సమావేశంలో పాల్గొన్న ఓ MLA కు కరోనా లక్షణాలు ఉన్నాయనే సమాచారం బయటకు పొక్కడంతో అందరిలో టెన్షన్ మొదలైంది. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
2020, ఏప్రిల్ 14వ తేదీ మంగళవారం కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇమ్రాన్ ఖాన్ ఖేడ్వాలా సీఎం విజయ్ రూపానీని కలుసుకున్నారు. ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్, రాష్ట్ర హోం మంత్రిని కలిశారు. ఈ సమయంలో కాంగ్రెస్ కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు శైలేష్ పర్మార్, షేక్ అక్కడే ఉన్నారు. అనంతరం ఎమ్మెల్యే ఇమ్రాన్ ఖాన్ ఖేడ్వాలాకు కరోనా పాజిటివ్ ఉందని తేలడంతో అందరిలో టెన్షన్ మొదలైంది. వైరస్ సోకిందా అనే భయం నెలకొంది.
ముందస్తు జాగ్రత్తలో భాగంగా వైద్య పరీక్షలు చేయనున్నారు. సీఎం విజయ్ రూపానీకి కూడా వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. కరోనా వైరస్ కేసులను నివారించడానికి బుధవారం ఉదయం 6 గంటల నుండి అహ్మదాబాద్‌లోని పాత నగరం, డానిలింబాడా ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించనున్నట్లు అంతకుముందు సీఎం విజయ్ రూపానీ వెల్లడించారు. గుజరాత్‌లో ఇప్పటివరకు 615 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి.
Also Read | Coronavirus relief package: 32 కోట్ల మందికి రూ.29 వేల కోట్లు