Third Weve : టెన్షన్ పెడుతున్న కరోనా థర్డ్ వేవ్..చిన్నారులు తట్టుకోగలరా?

మొదటి వేవ్..సెకండ్ కరోనా వేవ్ లతో ఇప్పటి వరకూ పెద్దలే ఎక్కువగా ఇబ్బంది పడ్డారు.కానీ థర్డ్ వేవ్ లో చిన్నారులకే ఎక్కువగా ప్రభావం ఉంటుందని నిపుణుల సూచనల మేరకు తల్లిదండ్రుల్లో టెన్షన నెలకొంది. ఈ కరోనా మహమ్మారిని పెద్దలే తట్టుకోలేక చాలామంది ప్రాణాలు కోల్పోయారు.కానీ ఈ మహమ్మారి ధాటికి చిన్నారులు తట్టుకోగలరా? అనే భయాందోళనలు వెల్లడవుతున్నాయి.

Third Weve : టెన్షన్ పెడుతున్న కరోనా థర్డ్ వేవ్..చిన్నారులు తట్టుకోగలరా?

Third Weve

Updated On : June 5, 2021 / 12:49 PM IST

Inflammatory syndrome children : మొదటి వేవ్..సెకండ్ కరోనా వేవ్ లతో ఇప్పటి వరకూ పెద్దలే ఎక్కువగా ఇబ్బంది పడ్డారు.కానీ థర్డ్ వేవ్ లో చిన్నారులకే ఎక్కువగా ప్రభావం ఉంటుందని నిపుణుల సూచనల మేరకు తల్లిదండ్రుల్లో టెన్షన నెలకొంది. ఈ కరోనా మహమ్మారిని పెద్దలే తట్టుకోలేక చాలామంది ప్రాణాలు కోల్పోయారు.కానీ ఈ మహమ్మారి ధాటికి చిన్నారులు తట్టుకోగలరా? అనే భయాందోళనలు వెల్లడవుతున్నాయి. దీంతో థర్ట్ వేవ్ టెన్షన్ నెలకొంది భారతదేశ వ్యాప్తంగా.

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనాపై రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. మొదటి వేవ్ కొన్ని నెలల పాటు కొనసాగింది. సెకండ్ వేవ్ కూడా కొన్ని నెలల పాటు జనాల్లో ఉక్కిరి బిక్కిరి చేసింది. చేస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడిప్పుడే కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ వల్ల కేసులు తగ్గుతున్నాయి. ఇది సంతోషకరమైన విషయమే. కానీ థర్డ్ వేవ్ మొదలు కానుంది. అదీకూడా పిల్లలమీద ఎక్కువ ప్రభావం చూపిస్తుందనే నిపుణుల సూచనల మేరకు ఆయా ప్రభుత్వాలు ఇప్పటికే ముందస్తలు జాగ్రత్తలు తీసుకున్నాయి. ఆక్సిజన్ నుంచి పలు రకాల మెడిసిన్స్ నుఅందుబాటులో ఉంచుకున్నాయి. అలాగే ప్రత్యేకంగా చిన్నారుల కోసం వార్డులను కూడా ఏర్పాటుచేసుకున్నాయి. ఈ క్రమంలో థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కోవటానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాయి. కానీ ఇప్పటికే కరోనా నుంచి కోలుకున్న చాలామందిచిన్నారుల్లో కొత్త వ్యాధి సమస్యగా మారింది. అదే ‘మల్టీసిస్టమ్ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్’ .

పిల్లల్లోనూ ‘మల్టీసిస్టమ్ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్’ లక్షణాలు కనిపిస్తున్నట్లు వైద్యులు గుర్తించారు. కరోనా నుంచి కోలుకున్న 3 వారాల్లో ఈ పరిస్థితి కనిపిస్తోందని.., కవాసాకి అనే వ్యాధి కూడా పిల్లల్లో కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. మల్టీసిస్టమ్‌ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్‌కి, కవాసాకికి దగ్గర లక్షణాలు ఉన్నాయని వారు అంటున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న 42 మంది పిల్లల్లో మల్టీ సిస్టం ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్‌ బారిన పడ్డట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. వారిలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ సిండ్రోమ్, కవాసాకిలతో పెద్దగా ప్రమాదం లేకున్నా.. జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.ఏమాత్రం అశ్రద్ధ చేయవద్దని హెచ్చరిస్తున్నారు. చాలావరకు యాస్పిరిన్, స్టెరాయిడ్స్‌తో ఇది తగ్గిపోతుందని లాన్సెట్‌ అనే ప్రముఖ అంతర్జాతీయ మెడికల్‌ జర్నల్‌ వివరించింది.

‘మల్టీసిస్టమ్ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్’ పిల్లల్లో సిండ్రోమ్ లక్షణాలు..
‘మల్టీసిస్టమ్ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్ సోకితే..జ్వరం, వాంతులు, డయేరియా, కడుపులో నొప్పి, శరీరంపై దద్దుర్లు, కళ్లు ఎర్రగా మారిపోవడం, పెదాలు, నాలుక మరింత ఎర్రగా మారడం లేదా వాపు, నీరసంగా ఉండటం, పాదాలు, చేతులు ఎర్రగా మారడం లేదా వాపు, కొందరిలో ఛాతీ నొప్పి, తీవ్ర నిస్సత్తువ, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది, తీవ్రత పెరిగితే పెదాలు, ముఖం నీలం రంగులోకి మారడం..తీవ్రమైన కడుపునొప్పి. ఉంటుందని తెలిపారు.

మల్టీసిస్టమ్ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్ (MIS-C) వ్యాధి అంటే ఏమిటి?
ఈ వ్యాధి కోవిడ్ -19 తో సంబంధం కలిగి ఉంటుంది. కుటుంబంలో ఎవరైనా కొవిడ్ బారిన పడితే వారిద్వారా పిల్లలకు సంభవిస్తుంది. కోవిడ్ రోగి కోలుకున్నా, పిల్లలు అతనితో సంబంధం కలిగి ఉంటే అప్పుడు ఈ వ్యాధి సోకుతుంది. అయినప్పటికీ కరోనా బారిన పడిన పిల్లలలో 0.14 శాతం మంది మాత్రమే MIS-C కి గురవుతున్నారు. జాగ్రత్తలు తీసుకోకపోతే ఆ సంఖ్య పెరుగుతుంది. పిల్లలలో మీరు నిరంతర జ్వరం, చర్మ మచ్చలు లేదా దద్దుర్లు, అలసట, ఎర్రటి కళ్ళు, విరేచనాలు వంటి సమస్యలను చూసినట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఈ వ్యాధిని డెంగ్యూ లేదా టైఫాయిడ్ లాగా చికిత్స చేయలేమని వైద్యులు చెబుతున్నారు. దీనికి చికిత్స పూర్తి భిన్నంగా ఉంటుందని పిల్లలను వెంటనే ఆసుపత్రిలో చేర్పించడం అవసరమని సూచిస్తున్నారు.