Corona Update: నెలరోజుల తర్వాత కేసులు తగ్గాయి.. మరణాలు మాత్రం తగ్గట్లేదు

శంలో కరోనా ప్రభావం నెమ్మదిగా తగ్గుతోండగా.. మరణాలు మాత్రం తగ్గట్లేదు. గతనెల 4.14 లక్షల వరకు చేరుకున్న పాజిటివ్‌ కేసులు ఇప్పుడు లక్షా 20వేలకు చేరుకున్నాయి. ఇదే సమయంలో 3380 మంది చనిపోయారు.

Corona Update: నెలరోజుల తర్వాత కేసులు తగ్గాయి.. మరణాలు మాత్రం తగ్గట్లేదు

Corona Update

Updated On : June 5, 2021 / 10:45 AM IST

Coronavirus Cases in India Today 5 June: దేశంలో కరోనా ప్రభావం నెమ్మదిగా తగ్గుతోండగా.. మరణాలు మాత్రం తగ్గట్లేదు. గతనెల 4.14 లక్షల వరకు చేరుకున్న పాజిటివ్‌ కేసులు ఇప్పుడు లక్షా 20వేలకు చేరుకున్నాయి. ఇదే సమయంలో 3380 మంది చనిపోయారు. కరోనా ఇన్‌ఫెక్షన్ కేసుల్లో తగ్గుదల కనిపిస్తున్నప్పటికీ మరణాల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం, ఏప్రిల్ 6వ తేదీ తర్వత.. సరిగ్గా నెల తర్వాత కరోనా కేసులు తక్కువగా నమోదయ్యాయి.

అయితే, వరుసగా 23వ రోజు, దేశంలో కొత్త కరోనా వైరస్ కేసుల కంటే ఎక్కువ రికవరీలు నమోదయ్యాయి. జూన్ 4వ తేదీ వరకు దేశవ్యాప్తంగా 22కోట్ల 78 లక్షల 60 వేల మోతాదుల కరోనా వ్యాక్సిన్ ఇవ్వబడింది. చివరి రోజున 36 లక్షల 50వేల టీకాలు ఇచ్చారు. అదే సమయంలో ఇప్పటివరకు మొత్తం 36 కోట్ల కరోనా పరీక్షలు జరిగాయి. చివరి రోజున 20 లక్షల కరోనా నమూనా పరీక్షలు జరిగాయి. పాజిటివిటీ రేటు 6 శాతానికి పైగా ఉంది.

కరోనా తాజా పరిస్థితి:
మొత్తం కరోనా కేసులు – 2కోట్ల 86లక్షల 94వేల 879మంది
కోలుకున్నవారు- రెండు కోట్ల 67 లక్షలు 95 వేల 549మంది
క్రియాశీల కేసులు – 15 లక్షలు 55 వేల 248మంది
చనిపోయినవారు- 3 లక్షలు 44 వేల 22మంది

దేశంలో కరోనా మరణాల రేటు 1.19 శాతం కాగా, రికవరీ రేటు 93 శాతానికి మించిపోయింది. యాక్టివ్ కేసులు 6 శాతం కన్నా తక్కువకు వచ్చాయి. కరోనా యాక్టివ్ కేసుల విషయంలో భారతదేశం ప్రపంచంలో రెండవ స్థానంలో ఉంది. మొత్తం కరోనా సోకినవారి సంఖ్య ప్రకారం భారతదేశం రెండవ స్థానంలో ఉంది. అమెరికా తరువాత ప్రపంచంలో, భారతదేశంలో అత్యధిక మరణాలు బ్రెజిల్‌లో నమోదయ్యాయి.