భారత్‌లో 24 గంటల్లో 24,586 కొత్త కరోనా కేసులు

భారతదేశంలో కరోనా వైరస్ సంక్రమణ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూ ఉన్నాయి. అయితే కోలుకుంటున్న వారి సంఖ్య కూడా నిరంతరం పెరుగుతోంది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకారం.. దేశంలో చురుకైన కేసుల సంఖ్య కంటే కోలుకుంటున్న వారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. గత 24 గంటల్లో భారతదేశంలో గరిష్టంగా 24,586 కొత్త కేసులు నమోదయ్యాయి, 336 మంది చనిపోయారు.
దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇప్పుడు 3,80,532గా ఉండగా.. వీటిలో 1,63,248 యాక్టివ్ కేసులు, 2,04,711మందికి నయమవగా.. 12,573 మంది మరణించారు. దేశంలో ఎక్కువగా ప్రభావితమైన రాష్ట్రాల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. ఇప్పటివరకు ఇక్కడ 1,20,504 మందికి కరోనా సోకింది.
కరోనా వైరస్ సంక్రమణ కారణంగా మహారాష్ట్రలో పరిస్థితి దారుణంగా ఉంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 5,751 మంది చనిపోగా.. ఇప్పటివరకు మొత్తం 1,20,504 మందికి వ్యాధి సోకింది. వారిలో 60,838 మందికి నయమైంది. 53,915 మంది ఈ ఘోరమైన వైరస్‌తో పోరాడుతున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య మూడవ స్థానంలో ఉన్నప్పటికీ, మరణాల్లో మాత్రం ఇది రెండవ స్థానంలో ఉంది. ఇక్కడ మరణాల సంఖ్య వేగంగా పెరుగుతోంది. కరోనా వైరస్ సంక్రమణ కారణంగా ఢిల్లీలో ఇప్పటివరకు 1969 మంది మరణించారు. రాష్ట్ర ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్‌తో పాటు ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు వైరస్ బారిన పడ్డారు.
ఇక తమిళనాడులో కరోనా వైరస్ సంక్రమణ కేసులు ఢిల్లీ కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ, మరణించిన వారి సంఖ్య మాత్రం చాలా తక్కువ. అదే సమయంలో, రికవరీ రేటు కూడా చాలా ఎక్కువగా ఉంది. తమిళనాడులో ఇప్పటివరకు 52,334 కరోనా వైరస్ సంక్రమణ కేసులు నమోదవగా.. 625 మంది మాత్రమే మరణించారు. రాష్ట్రంలో 28,641మంది కోలుకున్నారు. కేవలం 23,068 క్రియాశీల కేసులు మాత్రమే మిగిలి ఉన్నాయి.
Read: ఆసుపత్రిలో ఉరి వేసుకున్న COVID 19 రోగి