కోరలు చాస్తున్న కరోనా : భారత్ @ 315 కేసులు

  • Published By: madhu ,Published On : March 22, 2020 / 04:17 AM IST
కోరలు చాస్తున్న కరోనా : భారత్ @ 315 కేసులు

Updated On : March 22, 2020 / 4:17 AM IST

కరోనా వైరస్ కోరలు చాస్తోంది. ప్రపంచమే వణికిపోతోంది. చైనా నుంచి పాకిన ఈ వైరస్ దేశాలు విస్తరించింది. వేల సంఖ్యలో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నారు. భారతదేశంలో ఈ మహమ్మారి భయకంపితులను చేస్తోంది. రోజు రోజుకు కేసులు అధికమౌతున్నాయి. ఇప్పటివరకు ఈ వైరస్ తో నలుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే.

2020, మార్చి 21వ తేదీ శనివారం సాయంత్రం వరకు 315 మంది కరోనా రాకాసి బారిన పడ్డారు. భారత ఆరోగ్య పరిశోధన మండలి (ICMR) పాజిటివ్ వివరాలను ప్రకటించింది. మొత్తం 16 వేల 021 మంది నుంచి 16 వేల 911 నమూనాలను సేకరించినట్లు వెల్లడించింది. మహారాష్ట్రలో అత్యధికంగా కేసులు రికార్డవుతున్నాయి. అటు తెలుగు రాష్ట్రాల్లో కూడా వైరస్ బారిన పడుతున్నారు. ప్రధానంగా తెలంగాణలో క్రమక్రమంగా కేసులు అధికమౌతున్నాయి. శనివారం నాటికి 21 కేసులకు చేరగా..ఏపీలో ఐదు కేసులు రికార్డయ్యాయి.

కరోనా వైరస్ కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు మార్చి 22వ తేదీ ఆదివారం జనతా కర్ఫ్యూ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఇది కొనసాగనుంది. ప్రజలు బయటకు రాకుండా..ఇళ్లల్లోనే గడుపుతున్నారు. వ్యాపారస్థులు స్వచ్చందంగా బంద్ పాటిస్తున్నారు. దీంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి.