New Covid variant Eris: దేశంలో మళ్లీ కరొనా కలకలం.. తాజాగా 148 మందికి పాజిటివ్

కరోనా తరువాత, చైనాలో ఒక రహస్యమైన న్యుమోనియా ఇన్ఫెక్షన్ వ్యాపించింది. దీనికి సంబంధించి దేశంలో కొన్ని పాజిటివ్ కేసులు కనుగొన్నారు

New Covid variant Eris: దేశంలో మళ్లీ కరొనా కలకలం.. తాజాగా 148 మందికి పాజిటివ్

ప్రపంచవ్యాప్తంగా వేలాది మందిని బలిగొన్న కరొనా మహమ్మారి మళ్లీ ఆందోళన కలిగిస్తోంది. శీతాకాలం ప్రారంభం కావడంతో, భారతదేశంలో కొత్తగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. వాటి సంక్రమణ కూడా కాస్త భయాందోళనను కలిగిస్తోంది. వార్తా సంస్థ PTI నివేదిక ప్రకారం.. భారతదేశంలో ఒక్క రోజులో 148 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. శనివారం (డిసెంబర్ 9) కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ యొక్క నవీకరించబడిన డేటాలో ఈ సమాచారం ఇచ్చారు. ఉదయం 8 గంటలకు అప్‌డేట్ చేసిన డేటా ప్రకారం.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య 808కి పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

4.50 కోట్ల మందికి వ్యాధి
ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం.. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ సోనిక వారి సంఖ్య 4 కోట్ల 50 లక్షల 2 వేల 889 మంది. కాగా 5 లక్షల 33 వేల 306 మంది దీని వల్ల మృతి చెందారు. ఇక.. 4 కోట్ల 44 లక్షల 68 వేల 775 మంది ఈ వ్యాధి నుంచి కోలుకుని ఇంటికి తిరిగి వచ్చారు. కరొనా నుంచి కోలుకునే రేటు దేశంలో 98.81 శాతం కాగా, మరణాల రేటు 1.19 శాతం మాత్రమే. ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ప్రకారం.. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 220.67 కోట్ల యాంటీ కోవిడ్ వ్యాక్సిన్‌లు ఇచ్చారు.

ఇది కూడా చదవండి: బీజేపీకి ఓటేసిందని మహిళను విపరీతంగా కొట్టిన భర్త-బావ.. పిలిపించి ఓదార్చిన సీఎం

కరోనా తరువాత, చైనాలో ఒక రహస్యమైన న్యుమోనియా ఇన్ఫెక్షన్ వ్యాపించింది. దీనికి సంబంధించి దేశంలో కొన్ని పాజిటివ్ కేసులు కనుగొన్నారు. అయితే అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు హెచ్చరికలు జారీ చేసింది. ఇంతలోనే మరోసారి కరొనా తిరగబడుతుండడంపై ఆందోళనలు ఎక్కువయ్యాయి.