Muslim Woman Thrashed for Vote BJP: బీజేపీకి ఓటేసిందని మహిళను విపరీతంగా కొట్టిన భర్త-బావ.. పిలిపించి ఓదార్చిన సీఎం

కాంగ్రెస్ పార్టీకి జావేద్ బలమైన మద్దతుదారుడు. అదే సమయంలో బీజేపీకి బద్ద వ్యతిరేకి. దీంతో బీజేపీ పట్ల తాము సానుకూలంగా ఉండడంపై ఎప్పుడూ ఆగ్రహంతో ఉంటాడని సమీనా చెప్పింది

Muslim Woman Thrashed for Vote BJP: బీజేపీకి ఓటేసిందని మహిళను విపరీతంగా కొట్టిన భర్త-బావ.. పిలిపించి ఓదార్చిన సీఎం

బీజేపీకి ఓటు వేసినందుకు ముస్లిం మహిళపై కుటుంబ సభ్యులు దాడి చేసిన ఘటన మధ్యప్రదేశ్‌లోని సెహోర్ జిల్లాలో వెలుగు చూసింది. బాధితురాలి పేరు బీ.సమీనా. డిసెంబర్ 3న విడుదలైన ఫలితాల్లో బీజేపీ విజయం సాధించింది. అనంతరం డిసెంబర్ 4న ఆమె తమ కుటుంబంతో వేడుక చేసుకుంటోంది. ఇదే ఆమెను కష్టాల్లోకి నెట్టింది. ఆమె బీజేపీకి ఓటు వేసిందని ఆమె బావ జావేద్‌కు కోపం తెప్పించింది. దీంతో ఆమెను మొదట దుర్భాషలాడి, ఆపై కర్రతో కొట్టాడు. ఇక ఆయనకు మద్దతుగా భర్త కూడా చేరిపోయాడు. ఇద్దరూ కలిసి ఆమెను విపరీతంగా కొట్టారు.

ఇది కూడా చదవండి: చిరంజీవితో సినిమా చేయడానికి నేను రెడీ.. యానిమల్ డైరెక్టర్ కామెంట్స్.. చిరు ఛాన్స్ ఇస్తాడా?

విషయం తెలుసుకున్న మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్.. తన కార్యాలయానికి సమీనాను పిలుపించుకుని కలిశారు. ఆమెకు శివరాజ్ సింగ్ స్వయంగా ఫోన్ చేసి రమ్మని చెప్పారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వ లాడ్లీ బ్రాహ్మణ యోజన ద్వారా ప్రభావితమైన తర్వాత బీజేపీకి ఓటు వేసినట్లు సమీనా చెప్పింది. బాధితురాలు సెహోర్‌లోని బర్ఖేదా హసన్ గ్రామానికి చెందింది. ఇక తనపై జరిగిన దాడి గురించి శుక్రవారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడైన సమీనా బావపై 294, 323, 506, 34 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

కాంగ్రెస్ పార్టీకి జావేద్ బలమైన మద్దతుదారుడు. అదే సమయంలో బీజేపీకి బద్ద వ్యతిరేకి. దీంతో బీజేపీ పట్ల తాము సానుకూలంగా ఉండడంపై ఎప్పుడూ ఆగ్రహంతో ఉంటాడని సమీనా చెప్పింది. తాము బీజేపీ పేరు చెబితే చాలు, చిరాకు పడుతున్నాడని బాధితురాలు చెప్పింది. మొదట జావేద్ తనను దుర్భాషలాడాడని, ఆ తర్వాత కర్రతో కొట్టాడని, ఈ గొడవలో తన భర్త కూడా అతనికి మద్దతు ఇచ్చాడని సమీనా వాపోయింది.

ఇది కూడా చదవండి: మాకోసం మరో తేదీని కేటాయించండి.. శాసనసభ కార్యదర్శికి మాజీ మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి

ఈ సంఘటన తర్వాత రాష్ట్రీయ పస్మాండ ముస్లిం ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నౌషాద్ ఖాన్ బాధితురాలు, ఆమె తండ్రిని కలిసి కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని కలెక్టర్ ప్రవీణ్ సింగ్‌కు అధికారికంగా ఫిర్యాదు చేసి దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. అదే సమయంలో, ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఈ విషయమై తమకు ఫిర్యాదు అందిందని, అరెస్టులు చేశామని సెహోర్ ఎస్పీ మయాంక్ అవస్తీ తెలిపారు.