RT-PCR టెస్ట్ ధర తగ్గింది.. రూ.800 మాత్రమే

  • Published By: sreehari ,Published On : December 1, 2020 / 11:02 AM IST
RT-PCR టెస్ట్ ధర తగ్గింది.. రూ.800 మాత్రమే

Updated On : December 1, 2020 / 11:39 AM IST

RT-PCR test rate by a third : కరోనా నిర్ధారణ కోసం నిర్వహించే ఆర్‌టీ-పీసీఆర్ టెస్ట్ ధర భారీగా తగ్గించింది ప్రభుత్వం. సోమవారం నుంచి ఈ ఆర్టీపీసీఆర్ టెస్ట్ ధర రూ.800లకే లభ్యం అవుతోంది. ప్రస్తుతం ఉన్న ఆర్టీపీసీఆర్ టెస్ట్ ధరను రూ.2,400 నుంచి రూ.800 వరకు తగ్గించింది ఢిల్లీ ప్రభుత్వం. సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆదేశాల మేరకు RT-PCR టెస్ట్ శాంపిల్స్ ఇంటికి వచ్చి సేకరిస్తే రూ.1,200 వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో విజిట్, శాంపిల్ ఛార్జీలు కూడా వర్తిస్తాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ టెస్ట్ ఉచితంగా నిర్వహిస్తున్నారు.



https://10tv.in/too-much-salt-in-your-diet-can-weaken-your-immune-system/
అదే ఇంటికి వచ్చి టెస్టు చేయాలంటే మాత్రం అసలు ధరలో సగానికి చెల్లించాల్సి ఉంటుంది. అదే ప్రైవేటు ల్యాబుల్లో ఇదే టెస్టు చేయాలంటే రూ.800 చెల్లించాల్సి ఉంటుందని కేజ్రీవాల్ ట్వీట్ లో తెలిపారు. దీనికి సంబంధించి ఆదేశాలను ఆరోగ్య శాఖా మంత్రి సత్యేందర్ జైన్ జారీ చేశారు. రాష్ట్రంలో RT-PCR టెస్టులు చేయించుకునే వారిసంఖ్య పెరగాలనే ఉద్దేశంతో ప్రభుత్వం టెస్టు ధరను అసలు ధరలో మూడో వంతు తగ్గించింది. ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టు కంటే ఈ ఆర్టీపీసీఆర్ టెస్టు 60శాతం కచ్చితంగా ఉంటుంది. అయితే ఎంతమందికి టెస్టులు నిర్వహించారో ఆ సంబంధిత రిపోర్టులను ఐసీఎంఆర్ పోర్టల్‌లో అప్ డేట్ చేస్తారు.



గత 24 గంటల్లో ఎన్ని శాంపిల్స్ సేకరించారో కూడా ఆ డేటాను కూడా అప్ డేట్ అవుతుంది. అలాగే తగ్గిన ఆర్టీపీసీఆర్ కొత్త ధరలను కూడా అన్ని ల్యాబులు, ఆస్పత్రుల్లో అప్ డేట్ చేసేలా ఆదేశాలు జారీ అయ్యాయి. హైకోర్టు నుంచి ఆదేశాల మేరకు ఢిల్లీ ప్రభుత్వం రోజువారీ కోవిడ్ టెస్టులు, ఆర్టీపీసీఆర్ టెస్టులను పెంచింది. జూన్ నెలాఖరు వరకు ఆర్టీపీసీఆర్ టెస్టులు 8వేల నుంచి 9వేల వరకు నిర్వహించారు. ఇప్పుడు ఆ టెస్టులన్నీ దాదాపు 30వేల వరకు పెరిగాయి. దేశంలో ఇప్పటివరకూ ఆర్టీపీసీఆర్ పరీక్ష ధర ఒక ఢిల్లీలోనే అత్యధికంగా ఉండేది. ఇప్పుడు ఆ ధర కాస్తా మూడో వంతు తగ్గించింది ప్రభుత్వం.