Kuwait Aid to India: భారత్‌కు కువైట్ సాయం.. అండగా నిలుస్తున్న ప్రపంచ దేశాలు

భారత్‌లో కరోనా మహమ్మారి విలయం సృష్టిస్తోంది. లక్షల్లో కరోనా పాజిటివ్ కేసులు, వేలల్లో మరణాలు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఆస్పత్రులన్నీ కరోనా రోగులతో నిండిపోయాయి. ఆస్పత్రులకు ప్రాణవాయువు కొరత తీవ్రంగా వేధిస్తోంది.

Kuwait Aid to India: భారత్‌కు కువైట్ సాయం.. అండగా నిలుస్తున్న ప్రపంచ దేశాలు

Covid 19 Kuwait To Rush Oxygen And Aid To India

Updated On : May 4, 2021 / 9:24 AM IST

Kuwait Aid to India : భారత్‌లో కరోనా మహమ్మారి విలయం సృష్టిస్తోంది. లక్షల్లో కరోనా పాజిటివ్ కేసులు, వేలల్లో మరణాలు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఆస్పత్రులన్నీ కరోనా రోగులతో నిండిపోయాయి. ఆస్పత్రులకు ప్రాణవాయువు కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో లేక చాలా మంది రోగుల ప్రాణాలు కోల్పోతున్నారు. భారత కష్టాలను చూసిన పలు దేశాలు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నాయి.

గల్ఫ్ దేశం కువైట్ భారత్ కు సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. ప్రాణవాయువు కొరతతో ఇబ్బంది పడుతున్న భారత్‌కు ఆక్సిజన్ సిలిండర్లు పంపాలని కువైట్ కేబినెట్ నిర్ణయించింది. భారత్‌తో ఉన్న సత్ససంబంధాల దృష్ట్యా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు కువైట్ ప్రకటించింది. కువైట్ నుంచి భారత్ కు వైద్య పరికరాలు పంపింది. 282 ఆక్సిజన్ సిలిండర్లు, 60 ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్లతో పాటు వెంటిలేటర్లు, వైద్య పరికరాలను పంపింది.

కువైట్ సాయానికి భారత విదేశాంగ శాఖ కృతజ్ఞతలు తెలిపింది. మరోవైపు స్పెయిన్​, డెన్మార్క్​, నెదర్లాండ్స్​ దేశాలు సైతం భారత్​కు సాయం చేసేందుకు ముందుకొచ్చాయి. స్పెయిన్ 119 ఆక్సిజన్ కాన్సం​ట్రేటర్లు, 145 వెంటిలేటర్లు సరఫరా చేస్తుండగా.. డెన్మార్క్​ 53 వెంటిలేటర్లు పంపుతోంది. నెదర్లాండ్స్​ 100 ఆక్సిజన్​ కాన్సం​ట్రేటర్లు, 30 వేల యాంటీవైరల్​ ఔషధాలు, రెమ్​డెసివిర్​ డ్రగ్, 449 వెంటిలేటర్లు భారత్​కు పంపిపస్తున్నట్టు ఈయూ వెల్లడించింది. 15 వేల యాంటీవైరస్​ డ్రగ్స్​, 516 వెంటిలేటర్లను భారత్​కు పంపిస్తున్నట్లు జర్మనీ వెల్లడించింది.