లాక్‌డౌన్‌తో భారీగా పెరగనున్న నిరుద్యోగం

కరోనా వైరస్ ఎఫెక్ట్ ఆర్థిక వ్యవస్థ ఘోరంగా పడింది. నిరుద్యోగుల శాతం 23.4 శాతానికి పెరిగేలా చేసింది. భారత ఆర్థిక వ్యవస్థపై రెండు వారాల పాటు సర్వే చేసిన రిపోర్ట్ లో వివరాలు ఇలా ఉన్నాయి. ఏప్రిల్ 5 సోమవారం వరకూ నిర్వహించిన సర్వేలో మార్చిలో 8.4శాతం ఉన్న నిరుద్యోగ శాతం 23శాతానికి పెరిగింది. ఈ 2 వారాల్లోనే సుమారు 50మిలియన్ మంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారని భారత ప్రముఖ గణాంకుడు ప్రణబ్ సేన్ అంటున్నారు.
ఇప్పటికే కొందరిని ఇళ్లకు పంపేశారు. ఇంకా కొద్ది రోజులకు నిరుద్యోగం ఇంకా పెరిగే అవకాశాలు లేకపోలేదు. భారత్ లో చాలా మంది ఉద్యోగాల మీద బతికేవాళ్లే. ప్రభుత్వ అధికారులు సర్వే మెథడాలజీని ప్రశ్నిస్తున్నారు. నిరుద్యోగుల శాతం కూడా ఓ రకంగా మారుతుందని ఢిల్లీ జేఎన్యూ ఎకానమిక్ అసోసియేట్ ప్రొఫెసర్ హిమన్షు అంటున్నారు.
ప్రాణాలు కాపాడుకోవడానికి లాక్ డౌన్ లో ఉంటున్నాం.. ఓ సారి లాక్ డౌన్ ఎత్తేశాక పరిస్థితులు ఎలా ఉంటాయనేది కూడా అంతే ముఖ్యం. నా అంచనా ప్రకారం.. నిరుద్యోగం ఊహించని స్థాయికి చేరుతుంది. దేశంలోని సామాన్య కార్మికులు సైతం ఆర్థిక పరిస్థితులు తట్టుకోగలవు. ఆర్థిక పరంగా పట్టించుకోకపోతే వారిని ఆదుకునే వాళ్లు కూడా ఉండరు.
ప్రభుత్వం మీద పరిశ్రమల మీద రెండో లేదా మూడో ప్రభావం కనిపిస్తుంది. ప్రజలకు ఆర్థిక అవసరాలు పెరుగుతాయి. బౌన్స్ బ్యాక్ అవడానికి ప్రభుత్వం సరైన సహాయం అందించాలి. 9వేల మందిపై జరిపిన రెండు వారాల సర్వేలో సుమారు 23శాతం మంది నిరుద్యోగం తలెత్తేలా కనిపిస్తుందంటూ సీఎమ్ఐఈ మేనేజింగ్ డైరక్టర్, సీఈఓ మహేశ్ వ్యాస్ అన్నారు.