Himachal Pradesh: ఒక్కో లిక్కర్ సీసా మీద రూ.10 ‘కౌ-సెస్’ విధించిన కాంగ్రెస్ ప్రభుత్వం
కాంగ్రెస్‌కు అధికారాన్ని ఇచ్చినందుకు రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ, తన ముందున్న అతిపెద్ద సవాళ్లలో ఆర్థిక పరిస్థితి ముఖ్యమైందని, పైగా కఠినమైందని సీఎం సుఖు అన్నారు. 10,000 కోట్ల రూపాయల విలువైన రుణభారం, బకాయిలు తమ ప్రభుత్వానికి వచ్చాయని.. ఇదంతా గత బీజేపీ ప్రభుత్వ తప్పిదమని ఆయన విమర్శలు గుప్పించారు.

Cow cess of Rs 10 per bottle will be imposed in congress ruling Himachal Pradesh
Himachal Pradesh: కాంగ్రెస్ నేతృత్వంలోని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం మద్యంపై ‘కౌ సెస్’ విధించింది. ఒక్కో మద్యం సీసా మీద పది రూపాయల కౌ సెస్ వసూలు చేయనున్నట్లు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ కొత్త సెస్ ద్వారా రాష్ట్ర ఖజానాలోకి మరో 100 కోట్ల రూపాయలను తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. సుఖ్వీందర్ సింగ్ ప్రభుత్వం శుక్రవారం మొదటి బడ్జెట్ ప్రవేశ పెట్టింది. ఈ బడ్జెట్ ప్రసంగంలోనే ఈ ప్రకటన చేశారు. అయితే రాష్ట్ర ఎక్సైజ్ విభాగం ఇప్పటికే సీసాకు 2 రూపాయల చొప్పున కౌ సెస్ వసూలు చేస్తోంది. అయితే దానికి సవరణ చేసి కొత్తగా 10 రూపాయలు వసూలు చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
రాష్ట్రంలోని 12 జిల్లాల్లో ఉన్న గౌశాలలను నిర్వహించడానికి ఈ సెస్ ద్వారా వచ్చిన డబ్బుని వినియోగించనున్నారు. వాస్తవానికి గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రాష్ట్ర జీడీపీ తగ్గింది. ఇంతకు ముందు 7.6 శాతంగా ఉన్న రాష్ట్ర జీడీపీ తాజాగా 6.4 శాతానికి తగ్గింది. అందుకే ఈ కౌ సెస్ విధించినట్లు విశ్లేషకులు అంటున్నారు. కాంగ్రెస్‌కు అధికారాన్ని ఇచ్చినందుకు రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ, తన ముందున్న అతిపెద్ద సవాళ్లలో ఆర్థిక పరిస్థితి ముఖ్యమైందని, పైగా కఠినమైందని సీఎం సుఖు అన్నారు. 10,000 కోట్ల రూపాయల విలువైన రుణభారం, బకాయిలు తమ ప్రభుత్వానికి వచ్చాయని.. ఇదంతా గత బీజేపీ ప్రభుత్వ తప్పిదమని ఆయన విమర్శలు గుప్పించారు.
Madhya Pradesh Polls: ఆ ఇద్దరు నేతల చేరడంతో కింగ్‌మేకర్‌గా మారనున్న బీఎస్పీ