గోమాత కరోనా నుంచి రక్షిస్తుంది… కరోనా పేషెంట్లకు వరం… కౌ ప్లాస్మా

కరోనా వైరస్ పోరాటంలో కొందరు అమెరికా శాస్త్రవేత్తలు కౌవ్ నే నమ్ముకుంటున్నారు. రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండటం, హ్యుమన్ ప్లాస్మా కంటే గోవుల్లో ఉండే ప్లాస్మాలోనే యాంటి బాడీలు శక్తివంతంగా ఉండటమే ఇందుకు కారణమంటున్నారు. అందుకే ఆవుల్లోనే కృత్రిమంగా కరోనా యాంటి బాడీలను తయారు చేసే ప్రయోగాలు చేస్తున్నారు.
మనదేశంలో గోమాతకు ఉన్న ప్రాధన్యత ఎనలేనిది. గోవును లక్ష్మీగా పూజించే వారు ఉంటారు. అలానే అత్యంత కరుణ రసాన్ని ఒలికించే చూపులున్న ఆవును కామధేనువుగా కూడా కొలుస్తారు. ఆవు పాలను ఔషధంగానూ సేవిస్తారు. ఇంకొందరు గోమూత్రం కూడా ఔషధ గుణాలున్నదిగా చెప్పుతూవుంటారు. ఇవ్వన్ని ఒకెత్తైతే మానవాళికి పీడగా మారిన కరోనా వైరస్ కు మందు కనిపెట్టే క్రమంలోనూ గో మాత ప్రాముఖ్యత సంతరించుకుందని అమెరికా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
కరోనా వైరస్ ట్రీట్ మెంట్ లో ఇప్పుడు మనదేశంలో బాగా వినిపిస్తున్న పేరు ప్లాస్మా థెరపీ. వైరస్ నుంచి కోలుకున్న వ్యక్తులలో యాంటీ బాడీలు తయారవుతాయి. అవి రక్తంలోని ప్లాస్మాలోనే ఉంటాయి. అందుకే వైరస్ ను జయించిన వారిని ప్లాస్మా డొనేట్ చేయాల్సిందిగా కోరుతున్నారు.
అయితే ఇది ఆచారణలోకి రావడం లేదు. ఈ క్రమంలోనే శాస్త్రవేత్తలు గోవులను గుర్తు
తెస్తున్నారు. గోవులకు మనుషులకు సోకే వైరస్ లను ఎదుర్కొనే శక్తి ఉందని ఇప్పటికే రుజువు అయింది. అంత్రాక్స్, స్మాల్ పాక్స్, ఇన్ ఫ్లూయెంజా వంటి వైరస్ లకు ఆవు శరీరంలో తయారైన యాంటీ బాడీలతోనే చికిత్స చేస్తారు. అవ్వన్నీ విజయవంతం అయ్యాయి.
ఈ నేపథ్యంలోనే శాబ్ బయోథెరాప్యుటిక్స్ అనే ఫార్మా కంపెనీ ప్లాస్మా యాంటీ బాడీల క్లోనింగ్ ను ఆవులలో చేస్తోంది. ఆవుల యాంటీ బాడీలను, హ్యూమన్ యాంటీ బాడీలను కలుపుతున్నారు. ఆ తర్వాత వీటి డీఎన్ ఏ కణాలను ప్రయోగశాలలో ఆవు అండాల్లో ప్రవేశపెడుతున్నారు. అలా ఎదిగే గోవులు తర్వాత కాలంలో యాంటీ బాడీ గనులుగా మారుతాయని సాబ్ బయోథెరాప్యుటిక్స్ సంస్థ చెబుతుంది.
అయితే ఇక్కడే కొందరికి ఆవులపై మాత్రమే ఎందుకు జనరల్ గా చేసే చిట్టెలుకలు, కోతులపై చేయొచ్చుగా అనే సందేహం రావొచ్చు. అయితే వాటి ద్వారా వచ్చే ప్లాస్మా చాలా తక్కువని అదే గోవుల్లో అయితే ఎటువంటి హాని లేకుండా ప్రతి నెల 30 నుంచి 35 లీటర్లను సేకరించవచ్చని సాబ్ సంస్థ చెబుతోంది.