ఎన్నికల బరిలో నేరచరితులు : 213 మంది అభ్యర్థులపై క్రిమినల్‌ కేసులు

లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా 96 నియోజకవర్గాల్లో ఏప్రిల్‌ 11న జరిగే తొలి విడత పోలింగ్‌లో 213 మంది అభ్యర్థులపై క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి.

  • Published By: veegamteam ,Published On : April 6, 2019 / 06:16 AM IST
ఎన్నికల బరిలో నేరచరితులు : 213 మంది అభ్యర్థులపై క్రిమినల్‌ కేసులు

Updated On : April 6, 2019 / 6:16 AM IST

లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా 96 నియోజకవర్గాల్లో ఏప్రిల్‌ 11న జరిగే తొలి విడత పోలింగ్‌లో 213 మంది అభ్యర్థులపై క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి.

లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా 96 నియోజకవర్గాల్లో ఏప్రిల్‌ 11న జరిగే తొలి విడత పోలింగ్‌లో 213 మంది అభ్యర్థులపై క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. హత్య, మహిళలపై నేరాలు, కిడ్నాప్‌ వంటి తీవ్ర నేరాలు తమపై నమోదయ్యాయని ఆయా అభ్యర్థులు అఫిడవిట్‌లో వెల్లడించారు. ఎన్నికల పర్యవేక్షక సంస్థ (ఏడీఆర్‌) ఈ వివరాలు తెలిపింది. 1279 మంది అభ్యర్థులకు గాను 1266 మంది అఫిడవిట్లను పరిశీలించిన ఏడీఆర్‌ ఈ డేటాను వెల్లడించింది.
Read Also : వైసీపీ హామీ : జగన్ వస్తే కొత్త జిల్లాలు ఇవే

1266 మంది అభ్యర్థుల్లో 12 శాతం మందిపై తీవ్ర క్రిమినల్‌ కేసులు నమోదు కాగా, 12 మంది నేరస్తులుగా నిర్ధారించబడ్డారు. మరో పది మంది అభ్యర్థులు తమపై హత్య కేసులున్నాయని ప్రకటించారు. ఇక తమపై హత్యాయత్నం కేసులు నమోదయ్యాయని 25 మంది అభ్యర్థులు ప్రకటించారు. మహిళలపై నేరాల కేసులు నమోదయ్యాయని 16 మంది అభ్యర్థులు, కిడ్నాప్‌ అభియోగాలు ఎదుర్కొంటున్నామని నలుగురు అభ్యర్థులు ప్రకటించారు.

ఇక 12 మంది అభ్యర్థులు తమపై విద్వేష ప్రసంగాలు చేసినందుకు కేసులు ఎదుర్కొంటున్నామని వెల్లడించారు. మరోవైపు ఏప్రిల్‌ 11న తొలివిడత జరిగే 91 నియోజకవర్గాల్లో నేరస్తులు బరిలో ఉన్న 37 నియోజకవర్గాలను రెడ్‌ అలర్ట్‌ నియోజకవర్గాలుగా భావిస్తున్నారు.
Read Also : వైఎస్ఆర్ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల