దేశమంతా లాక్ డౌన్: SBI కీలక ప్రకటన.. పని చేస్తాం.. కానీ!

దేశీయ అతిపెద్ద బ్యాంకింగ్ దిగ్గజం.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. దేశమంతా లాక్ డౌన్ ప్రకటించడంతో తన సేవలపై వివరణ ఇచ్చింది. తమ సేవలు వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది. తమ సేవల్లో ఎలాంటి అంతరాయం వుండదని ఎస్‌బీఐ రిటైల్, డిజిటల్ బ్యాంకింగ్ విభాగం ఎండీ పీకే గుప్తా వెల్లడించారు.
అయితే కరోనా కారణంగా.. కొంత సిబ్బంది ఇబ్బంది మాత్రం ఉందని, అందుకే బ్యాంకులకు వచ్చేవాళ్లు మాత్రం సహకరించాలని, అలాగే ఆయా బ్రాంచ్‌లు పనిచేసే సమయాలను స్వల్పంగా తగ్గించినట్టు చెప్పారు అధికారులు. తమ వినియోగదారులు సురక్షితంగా ఉంటూ.. డిజిటల్ సేవలను ఉపయోగించుకోవాలని ఎస్బీఐ అభ్యర్థించింది.
డిజిటల్ లావాదేవీలు మాత్రం తమ కస్టమర్లకు అందుబాటులో ఉంటాయని ప్రకటించింది ఎస్‌బీఐ. ప్రస్తుత పరిస్థితుల్లో వినియోగదారులు డిజిటల్ లావాదేవీలకు ప్రాధాన్యత ఇవ్వాలని పీకే గుప్తా సూచించారు. మరోవైపు ఈ కఠినమైన సమయాల్లో దేశానికి సేవ చేయడానికి తమ సిబ్బంది కృషిని గుర్తించి, వందనం చేస్తున్నట్లు ట్వీట్ చేసింది ఎస్‌బీఐ.
Also Read | గుండెనొప్పితో చనిపోయాడు. కరోనా అనుకుని ఎవరూ దగ్గరకు వెళ్లలేదు.