Cyber Crimes: పక్క రాష్ట్రాలే టార్గెట్‌గా సైబర్ నేరగాళ్ల దందా
సైబర్ నేరగాళ్లకు అడ్డాలుగా ఉన్న జార్ఖండ్, రాజస్థాన్‌లోతో పాటు తాజాగా బీహార్‌లోని కొన్ని జిల్లాలు కూడా ఆ లిస్టులో చేరిపోయాయి. జార్ఖండ్‌లోని జామ్‌తారా, దేవఘర్, రాంచీ, రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌తో పాటు బీహార్‌లోని నలంద, గయా, బిహార్‌షరీఫ్, షేక్‌పురా జిల్లాల్లో..

Cyber Criminal Attacks With Special Plan
Cyber Crimes:సైబర్ నేరగాళ్లకు అడ్డాలుగా ఉన్న జార్ఖండ్, రాజస్థాన్‌లోతో పాటు తాజాగా బీహార్‌లోని కొన్ని జిల్లాలు కూడా ఆ లిస్టులో చేరిపోయాయి. జార్ఖండ్‌లోని జామ్‌తారా, దేవఘర్, రాంచీ, రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌తో పాటు బీహార్‌లోని నలంద, గయా, బిహార్‌షరీఫ్, షేక్‌పురా జిల్లాల్లో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. స్థానికంగా ఎటువంటి నేరాలకు పాల్పడకుండా.. ఇతర ప్రాంతాలనే లక్ష్యంగా చేసుకొని లూటీ చేసేస్తున్నారు.
దేశ వ్యాప్తంగా సైబర్ నేరాలు చేస్తున్న వీరి చదువులు మాత్రం అంతంతమాత్రమే. రెగ్యూలర్ చదువులైన 10వ తరగతి కూడా పాస్ అయినా దాఖలాల్లేవ్. సైబర్‌నేరాల్లో ఆరితేరిపోయి దోచేసుకుంటున్నారు. ముఖ్యంగా కేవైసీ అప్‌డేట్ చేయాలని, కార్డు బ్లాక్ అవుతుందని, OLX, Facebook, Quickr, QR Code, కస్టమర్ కేర్, లాటరీల పేర్లు చెప్పుకుని మోసాలకు పాల్పడుతున్నారు.
ఇలా పట్టుబడిన వారికి ఆరు నెలల వరకు బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారు. స్థానిక పోలీసులకు పట్టుబడకుండా సైబర్‌నేరగాళ్లు స్థానికంగా కేసులు లేకుండా చూసుకుంటున్నారు. స్థానికంగా నేరాలు చేయకపోతే పోలీసులు తమపై దృష్టి సారించరనే భావన ఆయా ముఠాలపై ఉంది. దీంతో స్వరాష్ర్టానికి చెందిన వారిని మోసం చేయకుండా.. పక్క రాష్ట్రాల వారిని టార్గెట్ చేస్తున్నారు. ఇతర రాష్ర్టాల్లో అయితే తమను ఎవరూ పట్టుకోరనే ధీమాతో నేరాలకు పాల్పడుతున్నారు.
జార్ఖండ్, రాజస్థాన్‌కు చెందిన సైబర్‌నేరగాళ్లు ఎక్కువగా కొన్ని నేరాల్లో ఆరితేరి ఉండగా.. బీహార్‌కు చెందిన సైబర్‌నేరగాళ్లు మాత్రం అన్ని రకాలైన నేరాలు చేస్తున్నారు. వ్యాపారాలు, స్టాక్ మార్కెట్‌లను అడ్డం పెట్టుకుని వ్యాపారుల వద్ద నుంచి లక్షలు కాజేస్తున్నారు. ఇటీవల బీహార్‌కు చెందిన ఇద్దరు సైబర్‌నేరగాళ్లను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో ఒకరు ఇన్వెస్ట్‌మెంట్‌తో పాటు, గుర్రం పందాల్లో పెట్టుబడులు పెడతామంటూ రూ.20 లక్షల వరకు టోకరా వేశాడు. మరొకడు హల్దీరామ్ డిస్ట్రిబూషన్ షిప్ ఇప్పిస్తానంటూ రూ.20 లక్షల వరకు మోసం చేశాడు.