Rahul Gandhi : సూరత్ కోర్టుకి హాజరైన రాహుల్
పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శుక్రవారం సూరత్ కోర్టుకు హాజరయ్యారు. 2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని ఇంటి పేరు "మోదీ" ఉద్దేశించి

Rahul
Rahul Gandhi పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శుక్రవారం సూరత్ కోర్టుకు హాజరయ్యారు. 2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని ఇంటి పేరు “మోదీ” ఉద్దేశించి రాహుల్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలపై గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ.. రాహుల్‌పై పరువు నష్టం కేసు వేశారు. పరిశీలనకు స్వీకరించిన సూరత్ కోర్టు.. రాహుల్ గాంధీ కోర్టుకి హాజరు కావాలని గతంలో నోటీసులు పంపింది
ఈ కేసుకి సంబంధించి ఇవాళ రాహుల్ సూరత్ కోర్టుకి హాజరయ్యారు. రాహుల్‌తోపాటు మరో ఇద్దరు సాక్షుల వాంగ్మూలాలను కోర్టు రికార్డు చేసింది. అయితే ఈ కేసుకి సంబంధించి సూరత్ కోర్టుకి రాహుల్ హాజరవడం ఇది మూడవసారి. చివరిగా జులై-24న ఈ కేసుకి సంబంధించి సూరత్ కోర్టుకి హాజరయ్యారు రాహుల్.
ALSO READ Long Range Bomb : భారత్ మరో ఘనత..లాంగ్ రేంజ్ బాంబ్ ప్రయోగం విజయవంతం