ఢిల్లీలో కాలుష్యం : విద్యార్ధులకు 50 లక్షల మాస్కులు పంపిణీ

ఢిల్లీలో వాయు కాలుష్యంతో ప్రజలు నానా పాట్లు పడుతున్నారు. దీంతో పలు అనారోగ్యాలకు గురవుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్ విద్యార్థులకు మాస్కులు పంపిణీ చేయాలని సీఎం కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయించింది. 50 లక్షల N95 మాస్కులను పంపిణీ చేస్తామని..ఒక్కో కిట్‌లో రెండు మాస్కులు ఉంటాయని తెలిపారు. శుక్రవారం (నవంబర్ 1) నుంచి సీఎం కేజ్రీవాల్ కూడా స్వయంగా విద్యార్థులకు పంపిణీచేయనున్నారు.
పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌ల్లో వ్యవసాయ పూర్తయిన తరువాత వ్యర్థాలను తగులబెడతుంటారు. ఈ కాలుష్యం ఢిల్లీ వాసులకు ప్రాణాంతకంగా మారుతోంది. శీతాకాలం వచ్చిదంటే చాలు విపరీతమైన మంచు పొగతో పాటు వ్యవసాయ వ్యర్థాలకు తోడు ఈ వ్యవసాయ వ్యర్థాల దగ్థం కూడా ఢిల్లీని కాలుష్యానికి గురి చేస్తోంది. దీంతో పలు అనారోగ్యాలకు గురవుతున్నారు నగర వాసులు. ఈ క్రమంలో విద్యార్థులకు మాస్కులు పంపిణీ చేయాలని సీఎం కేజ్రీవాల్ నిర్ణయించారు.
బుధవారం (అక్టోబర్ 30) నుంచి తెల్లవారుజామున వాయు కాలుష్యస్థాయి మరింత పెరిగి..గాలి నాణ్యత మరింత క్షీణించింది.గాలి నాణ్యత ప్రమాదస్థాయికి పడిపోయిందని ఢిల్లీ పర్యావరణ వేత్తలు వెల్లడించారు. వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి తమ ప్రభుత్వం చర్యలు తీసుకొంటోందని సీఎం కేజ్రీవాల్ వెల్లడించారు. నవంబర్ 04వ తేదీ నుంచి సరి – బేసీ విధానం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. చలికాలంలో పొగమంచుతో పాటు ఇతర వాహనాలు వెదజల్లే..కారకాలతో ఢిల్లీ ప్రజలు ఊపిరిపీల్చుకోవడం చాలా కష్టంగా మారుతోందని సీఎం అన్నారు.