Omar Abdullah : మీలో మీరు కొట్టుకుంటూనే ఉండండి.. కాంగ్రెస్, ఆప్‌పై ఒమర్ అబ్దుల్లా చురకలు..!
Delhi Election Result : ఢిల్లీలో కాంగ్రెస్, ఆప్ లోక్‌సభకు పొత్తు పెట్టుకున్నప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేశాయి. ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఆప్ అధికారాన్ని కొనసాగిస్తుందా? 27 ఏళ్ల తర్వాత బీజేపీ అధికారంలో తిరిగి వస్తుందా? తేలనుంది.

Omar Abdullah
Omar Abdullah : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టుగానే బీజేపీ మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. కమలం పార్టీ ఆధిక్యంలో దూసుకుపోతోంది. ఇక, అధికార ఆమ్‌ఆద్మీ పార్టీ (AAP), కాంగ్రెస్ (Congress) పార్టీలు వెనకంజలో ఉండిపోయాయి.
ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) స్పందించారు. కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యంగంగా చురకలు అంటించారు. ‘ఔర్ లాడో యాప్స్ మే’ (మీలో మీరు కొట్టుకుంటూనే ఉండండి) అనే క్యాప్షన్ (GIF)తో కూడిన సీక్రెట్ పోస్ట్‌ను షేర్ చేశారు.
Read Also : Delhi Election Results : ఆప్‌కు బిగ్ షాక్.. అరవింద్ కేజ్రీవాల్ ఓటమి.. బీజేపీ పర్వేష్ వర్మ చేతిలో పరాజయం
ఢిల్లీలోని 70 అసెంబ్లీ సీట్లలో దాదాపు 50 స్థానాలు బీజేపీ గెలుచుకుని ఆధిక్యంలో ఉన్నట్టుగా ట్రెండ్స్ చూపించిన తర్వాత నేషనల్ కాన్ఫరెన్స్ నేత “ఔర్ లాడో, జీ భర్ కే లాడో, సమాప్త్ కర్ దో ఏక్ దస్రే కో” (ఇంకా కొట్టుకోండి.. మీ మనస్సుకు నచ్చినంత వరకు పొట్లాడండి.. ఒకరినొకరు కొట్టుకోండి) అని రాసి ఉన్న జిఫ్ ఇమేజ్ పోస్ట్ చేస్తూ అబ్దుల్లా తన అసహనాన్ని వ్యక్తం చేశారు.
Aur lado aapas mein!!! https://t.co/f3wbM1DYxk pic.twitter.com/8Yu9WK4k0c
— Omar Abdullah (@OmarAbdullah) February 8, 2025
అందుకే ఫలితాల్లో వెనుకపడ్డారు :
ఢిల్లీలో బలం ఉన్నప్పటికీ ఆమ్ ఆద్మీపార్టీకి హస్తం పార్టీ సహకరించకపోవడం వల్లే ఈ ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో వెనుకంజలో పడ్డారని అబ్దుల్లా విమర్శించారు. ఇంకా మీలో మీరే కొట్టుకోండి అంటూ వారి వ్యవహర తీరుపై మండిపడ్డారు.
ఢిల్లీలో లోక్‌సభ ఎన్నికల్లో కూటమిగా పోటీ చేసినప్పటికీ, కాంగ్రెస్, ఆప్ అసెంబ్లీ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. రెండు పార్టీల నేతలు కూడా ఒకరిపై ఒకరు కొట్లాడేందుకు వెనుకాడలేదు. మరొకరు బీజేపీకి “బి-టీం” అని కూడా ఆరోపించారు.
ఢిల్లీకి సంబంధించిన పార్టీ నిర్ణయాలకు ప్రతిస్పందనగా.. ఒమర్ అబ్దుల్లా గత నెలలో ఇండియా కూటమి నాయకత్వం, ఎజెండాపై స్పష్టత లేదని వ్యాఖ్యానించారు. సార్వత్రిక ఎన్నికలే దాని ఏకైక ఉద్దేశ్యం అయితే సంకీర్ణాన్ని రద్దు చేయాలని ఆయన సూచించారు.
ఈ ఎన్నికలతో మాకు సంబంధం లేదు :
“ఢిల్లీ ఎన్నికలతో మాకు సంబంధం లేదు. నేను దీని గురించి ఏమీ చెప్పలేను. ఆప్, కాంగ్రెస్ క్షేత్రస్థాయిలో ఉన్న ఇతర పార్టీలు బీజేపీని ఎలా ఎదుర్కోవాలో నిర్ణయించుకోవాలి. నాకు గుర్తున్నంత వరకు, ఇండియా కూటమికి ఎలాంటి కాలపరిమితి లేదు.
Read Also : Parvesh Sahib Singh Verma : ఎవరీ పర్వేష్ వర్మ? కేజ్రీవాల్‌ను ఢిల్లీలో మట్టికరిపించిన బీజేపీ నేత..!
దురదృష్టవశాత్తు.. ఇండియా కూటమి సమావేశం జరగలేదు. కాబట్టి నాయకత్వం, ఎజెండా గురించి స్పష్టత లేదు. అది కేవలం పార్లమెంటు ఎన్నికల కోసమే అయితే వారు ఆ కూటమిని ముగించాలి” అని అబ్దుల్లా పేర్కొన్నారు.
ఢిల్లీలో మెజారిటీ మార్క్ 36 సీట్లు. 19 కౌంటింగ్ కేంద్రాలలో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు 19 కేంద్రాలలో జరుగుతోంది. ఓట్ల లెక్కింపు దేశ రాజధానిలో అధికారం ఎవరిదో నిర్ణయిస్తుంది. కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ హ్యాట్రిక్ విజయం సాధించాలని భావిస్తుండగా, 27 ఏళ్ల తర్వాత భారతీయ జనతా పార్టీ (BJP) తిరిగి అధికారంలోకి రావాలని ఉవ్విళ్లూరుతోంది. ఢిల్లీ అసెంబ్లీలో 70 సీట్లు ఉన్నాయి. దేశ రాజధానిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే, ఒక పార్టీ లేదా కూటమి 36 సీట్లు గెలుచుకోవాలి.