ఢిల్లీలో 24X7 రెస్టారెంట్లు తెరుచుకునేందుకు అనుమతి

Restaurants Can Stay Open 24X7 in Delhi: కరోనా వేళ ఢిల్లీ రెస్టారెంట్లకు పెద్ద ఊరట లభించింది. ఇకపై ఢిల్లీలో 24గంటలపాటు రెస్టారెంట్లు తెరుచుకునేందుకు అవకాశమిస్తున్నట్లు, అంతేకాకుండా అవసరమైన టూరిజం లైసెన్స్ లను కూడా తొలగిస్తున్నట్లు బుధవారం కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రకటించింది.
అదేవిధంగా, రెస్టారెంట్ ఇండస్ట్రీలో పర్మిట్ రాజ్ విధానానికి స్వస్తి పలికేందుకు రెస్టారెంట్లు పోలీస్ లైసెన్స్ మరియు లోకల్ బాడీస్(మున్సిపల్ కార్పొరేషన్లు) నుంచి హెల్త్ ట్రేడ్ లైసెన్స్ పొందే విధానాన్ని రద్దు చేయాలని కూడా ప్లాన్ చేస్తున్నట్లు ఓ ప్రకటనలో ప్రభుత్వం తెలిపింది.
రెస్టారెంట్ ఓనర్లతో సీఎం కేజ్రీవాల్ అధ్యక్షతన జరిగిన మీటింగ్ లో ఈ నిర్ణయాలు తీసుకోబడ్డాయని తెలిపింది. ఇలాంటి నిర్ణయాలు ఎక్కువమందికి ఉపాధి దొరికేందుకు సహాయపడతాయని తెలిపింది. ఇది.. ఢిల్లీ మోడల్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి ఓ ఉదాహరణగా నిలుస్తుందని తెలిపింది. రెస్టారెంట్లకు మున్సిపల్ కార్పొరేషన్లు జారీ చేసే హెల్త్ ట్రేడ్ లైసెన్స్ విధానాన్ని 10రోజుల్లోగా రద్దుచేయాలని కేజ్రీవాల్ అధికారులను ఆదేశించారు.