Sukesh Chandrashekhar : నేను చాట్ చేసింది ఎమ్మెల్సీ కవితతోనే.. మండోలి జైలు నుంచి సుఖేష్ చంద్రశేఖర్ మరో లేఖ
కవితక్కకు 15 కోట్ల డెలివరీ తర్వాత ఫేస్ టైంలో కేజ్రీవాల్, సత్యెేంద్ర జైన్ తో మాట్లాడిన స్క్రీన్ షాట్లను విడుదల చేస్తానని చెప్పారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో చాట్ చేసిన నెంబర్లు సుఖేష్ వెల్లడించించారు.

Sukesh Chandrashekhar
Sukesh Chandrashekhar : ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసులో అరెస్టైన సుఖేష్ చంద్రశేఖర్ మండోలి జైలు ఉన్నారు. ఇప్పటికే ఒక లేఖ రాసిన సుఖేష్ చంద్రశేఖర్ తాజాగా మండోలి జైలు నుంచి మరో లేఖ రాశారు. తాను చాట్ చేసింది ఎమ్మెల్సీ కవితక్కతోనేనని మరోసారి స్పష్టం చేశారు. ఆమె నెంబర్లతో సేవ్ చేసిన స్క్రీన్ షాట్ ను సుకేష్ విడుదల చేశారు. దమ్ముంటే తనతో జరిపిన చాట్ సంభాషణలపై సీబీఐ, ఈడీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కోర్టు ధ్రువీకరణతో ఎవిడెన్స్ చట్టం 65 బి కింద తాను స్క్రీన్ షాట్లను విడుదల చేశానని వెల్లడించారు.
కవితక్కకు 15 కోట్ల డెలివరీ తర్వాత ఫేస్ టైంలో కేజ్రీవాల్, సత్యెేంద్ర జైన్ తో మాట్లాడిన స్క్రీన్ షాట్లను విడుదల చేస్తానని చెప్పారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో చాట్ చేసిన నెంబర్లు సుఖేష్ వెల్లడించించారు. +91-6209999999, +91-8985699999 నెంబర్లు కవిత ఫోన్ నెంబర్లుగా వెల్లడించారు. అలాగే 9810154102 నంబర్ సత్యేందర్ జైన్ వ్యక్తిగత మొబైల్ నెంబర్ గా పేర్కొన్నారు. సత్యేంద్ర జైన్ తో కవితకు ఇచ్చిన రూ.15 కోట్ల నగదు డెలివరీ గురించి చర్చిస్తున్న చాట్ స్క్రీన్ షాట్ ను సుఖేశ్ విడుదల చేశారు.
Delhi liquor scam: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు షాక్.. లిక్కర్ స్కాంలో సీబీఐ నోటీసులు
తనకు తెలుగు ఎలా తెలుసని TRS/BRS నాయకులు చెబుతున్నారని సుకేశ్ అన్నారు. తన మాతృభాష తెలుగు, తమిళం అని పేర్కొన్నారు. తన చిన్నప్పటి నుంచి ఇంట్లో తన తల్లిదండ్రులు తెలుగు, తమిళంలో మాట్లాడతారని అది తన మాతృభాష అని వెల్లడించారు. టీఆర్‌ఎస్ నాయకులు ప్రధాన సమస్య నుండి దారి మళ్లించడానికి మాత్రమే సిల్లీ విషయాలు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.
జైలు నుంచి సుకేష్ ఈ చాట్‌లను ఎలా యాక్సెస్ చేయగలడనే ప్రశ్న ఉందన్నారు. ఫొటోలు, వీడియోలు తన బృందం ఆధీనంలో ఉన్నాయని తెలిపారు. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీల అభ్యర్థన ఆధారంగా బయట ఉన్న తన బృందం అన్ని ఆధారాలను అందజేస్తుందన్నారు. కవితను ఎల్లప్పుడూ తన అక్కగా గౌరవిస్తానని చెప్పారు. కేజ్రీవాల్ తీహార్ క్లబ్‌కు స్వాగతం పలికే సమయం ఆసన్నమైందన్నారు.
Arvind Kejriwal : కోర్టుకు ఈడీ, సీబీఐ తప్పుడు సమాచారం.. దర్యాప్తు సంస్థల తీరుపై కేజ్రీవాల్ అసహనం
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కు సీబీఐ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. నోటీసులు జారీ కావడంతో కేజ్రీవాల్ ఆదివారం సీబీఐ ముందు హాజరు కానున్నారు. కాగా, దర్యాప్తు సంస్థలపై కేజ్రీవాల్ ఆరోపణలు చేశారు. దర్యాప్తు సంస్థల తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. కోర్టు ముందు ఈడీ, సీబీఐలు తప్పుడు సమాచారం ఇస్తున్నారని పేర్కొన్నారు. ఈడీ విచారణలో కొందరి పేర్లు చెప్పాలని చందన్ రెడ్డిని టార్చర్ చేశారని ఆరోపించారు.