ఢిల్లీ వ్యక్తికి కరోనా….700మంది ఆఫీస్ ఉద్యోగులంతా దిగ్భందనం

  • Published By: venkaiahnaidu ,Published On : March 13, 2020 / 09:38 AM IST
ఢిల్లీ వ్యక్తికి కరోనా….700మంది ఆఫీస్ ఉద్యోగులంతా దిగ్భందనం

Updated On : March 13, 2020 / 9:38 AM IST

ఢిల్లీ శివార్లలోని నోయిడాలో ఓ లెదర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీలో పనిచేసే ఉద్యోగికి కరోనా వైరస్(COVID-19)సోకినట్లు నిర్థారణ అయిందని డాక్టర్లు తెలిపారు. అయితే ఆ ఫ్యాక్టరీలో పనిచేసే దాదాపు 700మంది ఉద్యోగులను హోమ్ క్వారంటైన్(ఇంటిలోనే దిగ్భందనం)చేసినట్లు అధికారులు తెలిపారు. అంతేకాకుండా సదరు ఫ్యాక్టరీని క్లోజ్ చేసి,శానిటైజ్ చేయబడుతున్నట్లు తెలిపారు.

బాధితుడు ఢిల్లీకి చెందిన 46ఏళ్ల వ్యక్తిగా గుర్తించారు. ఇటీవల ఇతను స్విట్జర్లాండ్,ఇటలీ వెళ్లి వచ్చినట్లుగా అధికారులు గుర్తించారు. ఇటలీలో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న విషయం తెలిసిందే. 25శాతంమంది జనాభాను ఇటలీలో క్వారంటైన్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బాధితుడు ఢిల్లీలోని సఫ్థార్ గంజ్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్నాడని,ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని ఉత్తరప్రదేశ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ అనురాగ్ భార్గవ్ తెలిపారు. దీంతో భారత్ లో ఇప్పటివరకు కరోనా సోకినవారి సంఖ్య 78కి చేరింది. మరోవైపు కరోనా దృష్ట్యా ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే ఢిల్లీలోని స్కూల్స్,కాలేజీలు,మాల్స్ అన్నింటినీ మూసివేసిన విషయం తెలిసిందే. మార్చి-31వరకు ఈ నిషేధం కొనసాగుతుందని ఢిల్లీ సీఎం ప్రకటించారు.

నెమ్మదిగా భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మరింత అలర్ట్ అయిన భారత ప్రభుత్వం ఏప్రిల్-15,2020వరకు విదేశీయులు ఎవరూ దేశంలోకి రాకుండా అన్ని వీసాలను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా (OCI) కార్డుదారులకు మంజూరు చేసిన వీసా రహిత ప్రయాణ సౌకర్యం 2020 ఏప్రిల్ 15 వరకు నిలుపుదల చేయబడింది. ఇది మార్చి 13,2020 నుంచి అమల్లోకి వచ్చింది. ఎక్కువగా గుంపులుగా ఉండవద్దని,వీలైనంత వరకు ప్రయాణాలను వాయిదా వేసుకోవడమే మంచిదని అధికారులు సూచిస్తున్నారు. (రెండు వారాలు పాటు ఐపీఎల్ వాయిదా?)

 కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు బ్రిటీష్ కాలం నాటి ఎపిడమిక్ డిసీజస్ యాక్ట్(అంటువ్యాధుల నివారణ చట్టం) 1897లోని సెక్షన్ 2ను భారత ప్రభుత్వం ప్రయోగించింది. ఈ చట్టం భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది. అమలులో ఉన్న చట్టాల ద్వారా ఏదైనా మహమ్మారిని అరికట్టడం సాధ్యం కాని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చట్టాన్ని వాడి వ్యాధుల్ని అరికట్టే చర్యలు చేపట్టవచ్చు.

ఈ చట్టాన్ని అనుసరించి రాష్ట్రాలలో అన్ని స్థాయుల్లో విద్యా సంస్థల్ని మూసి వేయడానికి, సరిహద్దు ప్రాంతాలని సీజ్ చేయడానికి, రోగులని హాస్పిటల్‌లో కానీ, నిర్బంధం‌లో కానీ ఉంచడానికి ఈ చట్టం అధికారులకి వీలు కల్పిస్తుంది.చ ట్టాన్ని అమలు చేసే ప్రక్రియలో అధికారులపై చట్టపరమైన కేసులు నమోదు చేసేందుకు వీలులేదు. ఈ చట్టం ప్రకారం… ఎవరైనా రోగి వైద్యం తీసుకోవడానికి గాని, అది మరింత వ్యాప్తి చెందకుండా నిర్బంధంలోకి వెళ్ళడానికి నిరాకరించినా అటువంటి వారిని నిర్బంధంలోకి తీసుకుని చికిత్స అందించే అధికారం ఉంటుంది. వైద్య పరీక్షల ఫలితాలు వచ్చిన రోజు నుంచి 14 రోజుల వరకు రోగిని అదుపులో ఉంచవచ్చు.

Also Read | హైదరాబాద్ టూ కర్ణాటక: కరోనాతో చనిపోయిన వ్యక్తి ఎక్కడెక్కడ తిరిగాడంటే…!