పోలీసులకు యువకుడు విచిత్రమైన ట్వీట్.. మరింత విచిత్రంగా పోలీసులు రిప్లై.. కామెడీ అదిరిపోయిందంతే..
Delhi Police: అతడు చేసిన ట్వీట్ లో స్పెల్లింగ్ మిస్టేక్ రావడంతో మరింత కామెడీ పుట్టుకొచ్చింది.

X
ఢిల్లీ పోలీసులకు ఓ యువకుడు విచిత్రమైన ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ కు పోలీసులు మరింత విచిత్రంగా సమాధానం ఇచ్చారు. ఆ సంభాషణ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. సాధారణంగా ఎవరైనా తప్పిపోతే పోలీసులు వెతికి పెడతారు.
అయితే, తనకు గర్ల్‌ఫ్రెండ్ లేదని, తన కోసం ఆమెను వెతికి పెట్టాలని కోరాడు ఓ యువకుడు. అతడు చేసిన ట్వీట్ లో స్పెల్లింగ్ మిస్టేక్ రావడంతో మరింత కామెడీ పుట్టుకొచ్చింది. ఢిల్లీకి చెందిన ఓ యువకుడు ట్వీట్ చేస్తూ.. “సింగిల్” అనే అక్షరాన్ని “సిగ్నల్” అని తప్పుగా రాశాడు. తాను సింగిల్ గా ఉన్నానని, తనకు గర్ల్‌ఫ్రెండ్ ఎప్పుడు దొరుకుతుందని పోలీసులను అడిగాడు.
ఢిల్లీ పోలీసులు ఆ ట్వీట్‌కు స్పందిస్తూ రెండు జోకులు వేశారు. “సర్.. మేము ఆమెను కనిపెట్టడంలో మీకు సాయం చేస్తాము (అయితే ఆమె ఎప్పుడైనా తప్పిపోతేనే ఈ సాయం చేస్తాము). మీ కోసం ఓ టిప్.. మీరు సిగ్నల్ అయితే.. గ్రీన్ రంగులోనే ఉండండి. రెడ్ లో ఉండొద్దు’’ అని పోలీసులు చమత్కరించారు.
Sir, we can help you find her (only if she ever goes missing).
Tip: If you are a ‘signal’, we hope you stay green, not red. https://t.co/3wHDwGxlEl
— Delhi Police (@DelhiPolice) May 31, 2024
Also Read: ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే టాప్-10 విమానాశ్రయాలు ఇవే.. మన దేశ ఎయిర్‌పోర్ట్ కూడా..