Delhi Pollution: ఢిల్లీలో తీవ్రవాయు కాలుష్యం.. కేజ్రీవాల్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు..!
దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం ప్రమాదకరస్థాయికి చేరుతోంది. ఇప్పటికే గాలి నాణ్యత తీవ్రంగా క్షీణించింది. వాయుకాలుష్య నివారణకు అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది.

Delhi Pollution Schools Shut For Week
Delhi pollution: దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం ప్రమాదకరస్థాయికి చేరుతోంది. ఇప్పటికే గాలి నాణ్యత తీవ్రంగా క్షీణించింది. వాయుకాలుష్య నివారణకు అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. అయినప్పటికీ గాలి కాలుష్యం తీవ్రమవడంతో ఢిల్లీ ప్రభుత్వం శనివారం (నవంబర్ 13) అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో వాయుకాలుష్యంపై కేజ్రీవాల్ ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. సోమవారం నుంచి ఢిల్లీలో పాఠశాలలు, కార్యాలయాలను మూసివేయాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని సూచనలు చేసింది. అలాగే ప్రభుత్వోద్యోగులకు ఇంటి వద్ద నుంచే పని చేసే అవకాశం కల్పించారు. వారం రోజుల పాటు విద్యార్థులకు ఫిజికల్ స్కూల్స్ మూసివేయనున్నారు. రేపటి (ఆదివారం) నుంచి మూడు రోజుల పాటు ఢిల్లీలో నిర్మాణ పనులు నిలిపివేశారు. ప్రభుత్వ కార్యాలయాలు ఒక వారం పాటు 100 సామర్థ్యంతో వర్క్ ఫ్రమ్ హోం పనిచేయాలన్నారు.
ప్రైవేటు కార్యాలయాలు వీలైనంత వరకు వర్క్ ఫ్రమ్ హోంకు అనుమతి ఇవ్వాలని సూచించారు. వాయుకాలుష్య సమస్యను ఎదుర్కొనేందుకు దీర్ఘకాలిక ప్రయత్నాలతో పాటు తక్షణం, అత్యవసరంగా స్పందించడానికి ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు గట్టిగా సూచనలు చేసింది. కోర్టు ఆదేశాలతో సీఎం కేజ్రీవాల్ స్పందించారు. ఢిల్లీలో లాక్‌డౌన్ విధించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.
Read Also : Electric Scooters : భారత్‌లో మధ్యతరగతి ప్రజలు ఎలక్ట్రిక్ స్కూటర్ల వైపు ఎందుకు మొగ్గుచూపుతున్నారు