Gujarat High Court: మోదీ విద్యార్హతలపై కీలక తీర్పు.. సీఎం కేజ్రీవాల్ కు షాక్.. రూ.25 వేల జరిమానా
ప్రధాని మోదీకి విద్యార్హతలకు సంబంధించిన వివరాలు తెలపాల్సిన అవసరం లేదని గుజరాత్ హైకోర్టు తెలిపింది. విద్యార్హతల వివరాలు తెలపాలన్న ఆదేశాలను కూడా కొట్టేసింది.

Arvind Kejriwal
Gujarat High Court: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు గుజరాత్ హైకోర్టు (Gujarat High Court)లో భారీ షాక్ తగిలింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)కి సంబంధించిన డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ సర్టిఫికెట్లను బయటకు చూపించాల్సిన అవసరం లేదంటూ గుజరాత్ హైకోర్టు (Gujarat High Court) ఇవాళ తీర్పు చెప్పింది.
అంతేగాక, ఆ వివరాలు అడుగుతూ కోర్టును ఆశ్రయించిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు రూ.25,000 జరిమానా విధించింది. ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) అటువంటి వివరాలు చెప్పాల్సిన అవసరం లేదని హైకోర్టు పేర్కొంది. మోదీ విద్యార్హతల ఆధారలు చూపాలంటూ ప్రధాన మంత్రి కార్యాలయ (PMO) ప్రజా సమాచార అధికారి (PIO)కి ప్రధాన సమాచార కమిషన్ (CIC) ఇచ్చిన ఆదేశాలను కూడా గుజరాత్ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం న్యాయమూర్తి జస్టిస్ బైరెన్ వైష్ణవ్ పక్కనపెట్టారు.
గుజరాత్ యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీలు మోదీ డిగ్రీ, పీజీ డిగ్రీ వివరాలు తెలపాలని ప్రధాన సమాచార కమిషన్ (CIC) ఇచ్చిన ఆదేశాలను కూడా పక్కన పెడుతున్నట్లు చెప్పారు. కాగా, మోదీ నిజంగానే డిగ్రీ, పీజీ డిగ్రీ చదివారా? అంటూ అరవింద్ కేజ్రీవాల్ చాలా కాలంగా నిలదీస్తున్నారు. మోదీ అంత చదువుకున్నది నిజమైతే అందుకు సంబంధించిన ఆధారాలు చూపాలని డిమాండ్ చేస్తున్నారు.
Renuka Chowdhury : ప్రధాని, కేంద్రమంత్రిపై కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు