కరోనా వైరస్ నివారణకు మందు!
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రకంపనలు పుట్టిస్తోంది. భారతదేశంలో కూడా కరోనా వైరస్ అనుమానితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రకంపనలు పుట్టిస్తోంది. భారతదేశంలో కూడా కరోనా వైరస్ అనుమానితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రకంపనలు పుట్టిస్తోంది. భారతదేశంలో కూడా కరోనా వైరస్ అనుమానితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కరోనా వైరస్ నిరోధించేందుకు వాడవలసిన ఔషధం, పాటించవలసిన జాగ్రత్తల గురించి భారత ఆయుష్ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. కరోనా వైరస్ వల్ల తలెత్తే ఇన్ఫెక్షన్లను ఎదుర్కోవటానికి హోమియోపతి, యునానీ ఔషధాలు మంచివని సూచించింది. హోమియోపతి ద్వారా కరోనా వైరస్ ప్రభావాన్ని ఎదుర్కొనే విధానాల గురించి చర్చించేందుకు సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రిసెర్చ్ ఇన్ హోమియోపతి సలహా మండలి సమావేశమైంది. ఈ సందర్భంగా హోమియోపతి మందు ‘ఆర్సెనికం ఆల్బమ్ 30’ ను ఖాళీ కడుపుతో మూడు రోజుల పాటు తీసుకోవటం ద్వారా కరోనా నుంచి రక్షణ పొందవచ్చని తెలిపారు.
కరోనా పేరు చెబితే యావత్ ప్రపంచం కంగారు పడుతోంది. భారత్‌లోనూ కిల్లర్ వైరస్ కలకలం సృష్టిస్తోంది. కరోనా వైరస్ భారత్‌ను వణికిస్తోంది. మన దేశంలో పాజిటివ్ కేసులు లేకపోయినా… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. చైనా, ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను అంతర్జాతీయ విమానాశ్రయాల్లో అధికారులు పరీక్షిస్తున్నారు.
ఢిల్లీలో బుధవారం మూడు అనుమానిత కేసులు నమోదయ్యాయి. భారత్ లో పాజిటివ్ కేసులు లేకపోయినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ముందస్తు చర్యలు తీసుకుంటున్నాయి.