Five States Assembly Elections 2023 Schedule : ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల.. తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్

దేశంలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) షెడ్యూల్ విడుదల చేసింది

Five States Assembly Elections 2023 Schedule : ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల.. తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్

Five States Assembly Elections 2023 Date

Assembly Elections 2023 : దేశంలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) షెడ్యూల్ విడుదల చేసింది. సోమవారం మధ్యాహ్నం 12గంటలకు జరిగిన మీడియా సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ రాజీవ్ కుమార్ ఈ షెడ్యూల్ ను విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రంతోపాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ గడ్, మిజోరం రాష్ట్రాలు అసెంబ్లీ ఎన్నికల తేదీలను వెల్లడించారు.

తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ ఇలా ..
నవంబర్ 3న నోటిఫికేషన్
నవంబర్ 10 వరకు నామినేషన్లకు చివరి తేదీ
నవంబర్ 13న నామినేషన్ల పరిశీలన
నవంబర్ 15న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ
నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
డిసెంబర్ 3న ఫలితాలు
ఒకే విడతలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు

రాష్ట్రాల వారిగా పోలింగ్ తేదీ వివరాలు..
రాజస్థాన్ లో నవంబర్ 23న
మధ్యప్రదేశ్, మిజోరాంలో నవంబర్ 7న
చత్తీస్ గఢ్ లో రెండు విడతల్లో నవంబర్ 7, 17 తేదీల్లో పోలింగ్
తెలంగాణలో నవంబర్ 30న
ఐదు రాష్ట్రాల్లో డిసెంబర్ 3న ఎన్నికల కౌంటింగ్

 

Assembly Elections 2023

Assembly Elections 2023

 

అంతకు ముందు రాజీవ్ కుమార్ మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణ కోసం ఆరు నెలలుగా కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. 40 రోజుల్లో ఐదు రాష్ట్రాల్లో పర్యటించామని తెలిపారు. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మిజోరాం రాష్ట్రాల్లో మొత్తం 679 నియోజక వర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయని, వీటిల్లో 16.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. అన్ని రాష్ట్రాల్లో మహిళా ఓటర్ల సంఖ్య పెరిగిందని అన్నారు. మిజోరం, ఛత్తీస్ గఢ్ లో మహిళా ఓటర్ల సంఖ్య అధికంగా ఉన్నట్లు తెలిపారు. ఐదు రాష్ట్రాల్లో 60లక్షల మంది కొత్త ఓటర్లు తమ ఓటు హక్కు నమోదు చేసుకున్నట్లు చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేయనున్నామని, సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్ట చర్యలు చేపడుతున్నామని అన్నారు. ఈ ఎన్నికల్లో వృద్ధులకు ఇంటి నుంచి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఐదు రాష్ట్రాల్లో తక్షణం ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లు తెలిపారు.