పోలింగ్ బూత్ లో గుండెపోటుతో ఎన్నికల అధికారి మృతి

  • Published By: veegamteam ,Published On : April 18, 2019 / 07:23 AM IST
పోలింగ్ బూత్ లో గుండెపోటుతో ఎన్నికల అధికారి మృతి

Updated On : April 18, 2019 / 7:23 AM IST

ఛత్తీస్ ఘడ్ : ఎన్నికల వేళ కన్కెకర్ లో విషాదం నెలకొంది. ఎన్నికల నిర్వహణాధికారి పోలింగ్ బూత్ లో మృతి చెందాడు. ఛత్తీస్‌ఘడ్‌ లో మూడు లోక్‌సభ సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల విధులకు కోసం ఓ ఎన్నికల నిర్వహణ అధికారి కన్కెకర్ కు వెళ్లాడు. అయితే అతనికి గుండెపోటుతో రావడంతో పోలింగ్ బూత్ లోనే మృతి చెందాడు. దీంతో తోటి అధికారులు విషాదంలో మునిగిపోయారు. తమతోపాటే విధులకు వచ్చిన అధికారి మృతి చెండటంతో తీవ్రంగా బాధపడుతున్నారు.

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దేశవ్యాప్తంగా లోక్‌సభ రెండవ దశ పోలింగ్‌ కొనసాగుతోంది. దేశంలోని 11 రాష్ట్రాల్లోని 95 లోక్‌సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభం అయిన పోలింగ్ సాయంత్రం 5గంటల వరకు జరుగనుంది. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం సాయంత్రం 4గంటల వరకు మాత్రమే పోలింగ్ జరుగనుంది. మొత్తం 1,611 మంది అభ్యర్థులు రెండో విడత ఎన్నికల బరిలో ఉన్నారు.