Jharkhand : గుంపులో నుంచి వేరుబడిన ఏనుగు…16 మందిని చంపేసింది.

ఏనుగు మందలో నుంచి వేరు అయిపోయిన ఓ ఏనుగు 16 మందిని చంపేసింది. ఆరు జిల్లాల్లో సుమారు 500 కిలోమీటర్లు ప్రయాణించిన ఏనుగు ఇంతమందిని చంపేసింది. మే నెల ప్రారంభంలో ఆ ఏనుగు మంద నుండి విడిపోయింది. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

Jharkhand : గుంపులో నుంచి వేరుబడిన ఏనుగు…16 మందిని చంపేసింది.

Jharkhand

Updated On : June 27, 2021 / 5:18 PM IST

Elephant Kills : గుంపులో నుంచి వేరు అయిపోయిన ఓ ఏనుగు 16 మందిని చంపేసింది. ఆరు జిల్లాల్లో సుమారు 500 కిలోమీటర్లు ప్రయాణించిన ఏనుగు ఇంతమందిని చంపేసింది. మే నెల ప్రారంభంలో ఆ ఏనుగు మంద నుండి విడిపోయింది. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. Tundi ప్రాంతంలోని Dhanbad వద్ద మంద నుంచి ఏనుగు వేరు పడిందని, ఆ తర్వాత ఆ ఏనుగు..అటవీ ప్రాంతం గుండా..Sahebganj వరకు ప్రయాణించిందని Principal Chief Conservator of Forests and Jharkhand’s Chief Wildlife Warden Rajiv Ranjan వెల్లడించారు.

జమ్తారా, డియోఘర్, డుమ్కా, పకూర్, షాహిబ్ గంజ్ గుండా వెళ్లి..మళ్లీ తుండికి చేరుకుందన్నారు. ఈ ప్రాంతాల్లో మనుషులపై దాడి చేసి 16 మందిని చంపేసిందన్నారు. జమ్తారాలో నలుగురిని, డియోఘర్ లో ముగ్గురిని, దుమ్కా, షాహీబ్ గంజ్ లో మరో ముగ్గురిని, పకూర్ లో ఇద్దరిని, ధన్ బాద్ లో ఒక్కొరిని దాడి చేసి చంపేసిందన్నారు. ఏనుగు దగ్గరకు గ్రామస్తులు ఎక్కువ రావడంతో మరణాల సంఖ్య ఎక్కువగా ఉందని, ప్రస్తుతం ఏనుగు ఎక్కడుందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నామన్నారు.

సమీప గ్రామస్తులను మైక్ ద్వారా హెచ్చరించడం జరుగుతోందని, మందల్లో ఏనుగును కలపడానికి తాము ప్రయత్నించడం జరుగుతోందన్నారు. మూడేళ్ల క్రితం ఓ ఏనుగు 20 మందికి పైగా చంపిన ఘటనను గుర్తు చేసుకుంటున్నారు. మరణించిన కుటుంబసభ్యులకు పరిహారంగా రూ. 4 లక్షలను అక్కడి ప్రభుత్వం కల్పిస్తోంది.