Elephants Video Viral: ఆసుపత్రిలో కలియతిరిగిన ఏనుగులు.. వీడియో వైరల్.. తీవ్ర విమర్శలు
రెండు ఏనుగులు ఆసుపత్రి లోపలికి వెళ్లిపోయాయి. అందులోని గదుల్లో దర్జాగా కలియతిరిగాయి. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పశ్చిమ బెంగాల్ లోని జల్పాయీగురీ ఆర్మీ ఆసుపత్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి సుశాంతా నంద ఈ వీడియోను ట్విటర్ లో పోస్ట్ చేశారు. కారిడార్ లో రెండు ఏనుగులు తిరగడం విస్మయానికి గురి చేస్తోంది.

Elephants Video Viral
Elephants Video Viral: రెండు ఏనుగులు ఆసుపత్రి లోపలికి వెళ్లిపోయాయి. అందులోని గదుల్లో దర్జాగా కలియతిరిగాయి. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పశ్చిమ బెంగాల్ లోని జల్పాయీగురీ ఆర్మీ ఆసుపత్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి సుశాంతా నంద ఈ వీడియోను ట్విటర్ లో పోస్ట్ చేశారు. కారిడార్ లో రెండు ఏనుగులు తిరగడం విస్మయానికి గురి చేస్తోంది.
ఆసుపత్రిలో రోగులు, వైద్యులకు ఏనుగులతో ప్రమాదం ఉంటుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆసుపత్రిలోకి ఏనుగులు రావడం ఏంటని, ఇటువంటి ఘటనలు మరోసారి జరగకుండా చర్యలు తీసుకోవాలని కొందరు అన్నారు. ఆ ఏనుగులు కూడా వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చాయా? అంటూ ఓ నెటిజన్ సెటైర్ వేశారు. ఈ ఘటనపై స్పందించిన అధికారులు మరోసారి ఇటువంటి ఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు.
Elephant in Binnaguri Army Hospital. pic.twitter.com/KJeCuRJgJG
— Office of Dilip Ghosh (@DilipGhoshOff) September 5, 2022